BigTV English

Prashant Kishore About YSRCP : జగన్ ఓటమి ఖాయమన్న ప్రశాంత్.. విరుచుకుపడిన ఏపీ మంత్రులు

Prashant Kishore About YSRCP : జగన్ ఓటమి ఖాయమన్న ప్రశాంత్.. విరుచుకుపడిన ఏపీ మంత్రులు

Prashant Kishore on YSRCP


Prashant Kishore on YSRCP Loss(Breaking news in Andhra Pradesh): రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమిని కాదు.. ఘోర ఓటమిని చవిచూడబోతున్నాడు. ఈ మాట ఎవరో కాదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుకు కీలకపాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్నారు. హైదరాబాద్‌లో ఓ పత్రికా కాంక్లేవ్‌లో ఏపీ రాజకీయాలపై ఆయన స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని చెప్తూ.. వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పని వ్యాఖ్యానించారు. జగన్ ఇలా చేయడం వల్లే రాజకీయంగా నష్టపోబోతున్నాడని కుండబద్ధలు కొట్టినట్టు పీకే చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్‌కి కూడా అదే జరిగిందని అన్నారు. పాలనా కాలంలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు పడవని పీకే అన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్ కు ఒక మైనస్ అవుతుందన్నారు.


Read More : విజయవాడ సీఐడీ ఎస్పీగా మలికాగార్గ్ బదిలీ.. రాజకీయ ఒత్తిడులే కారణమా ?

అయితే.. పీకే వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. బిహార్ లో సొంతగా ఒక పార్టీ పెట్టి బొక్కబోర్లా పడిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఒక పీకే సరిపోవడం లేదని.. మరో పీకేను మద్దతుగా తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పీకే పలుమార్లు భేటీ అయ్యారన్నారు. జగన్ వెంటే పీకేలు లేరని.. ప్రజలే ఉన్నారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అన్నారు మంత్రి.

మరోవైపు.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మరో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆనాడు ఇలాగే జోస్యాలు చెప్పిన లగడపాటి రాజగోపాల్‌.. రాజకీయ సన్యాసం తీసుకున్నారని.. ఇప్పడు ప్రశాంత్ కిషోర్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారని ట్వీట్ చేశారు. కుట్రలో భాగంగానే వైసీపీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ అంబటి ఫైర్ అయ్యారు.

కాగా.. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో పీకే టీడీపీ తరపున పనిచేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, ఆయన కేవలం మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశారని తెలిసింది. చంద్రబాబుకు, తనకు సన్నిహితుడైన ఓ నాయకుడు కోరడంతోనే విజయవాడ వెళ్లి ఆయన్ను కలిసినట్లు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×