BigTV English

Minister Kakani: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

Minister Kakani: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

Minister Kakani: నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందనే నమ్మకం తమకు లేదని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే జిల్లా కలెక్టర్ పక్షపాత వైఖరితో వ్యవహరించారని ఆరోపించారు.


ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని మండిపడ్డారు. జిల్లా ఎన్నికల యంత్రాంగ తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. జూన్4 న కౌంటింగ్ నిర్వహణకు అబ్జర్వర్ లను నియమించాలని కోరారు. ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేశారని ఆరోపించారు. అంతే కాకుండా కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని అన్నారు.

Also Read: పిన్నెల్లి హత్యకు కుట్ర..పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు


వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. మాచర్ల ఘటన వీడియో ఎలా భయటకు వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమీషన్ ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకు డబ్బులు పంచితే ..దానిపై ఫిర్యాదు చేస్తే ఆర్వో కనీసం పట్టించుకోలేదని అన్నారు. మావవతా దక్పథంతో సోమిరెడ్డి డబ్బులు పంచారని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×