BigTV English

Gold worth Rs. 12 Crore Seized: భారీగా బంగారం పట్టివేత.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు!

Gold worth Rs. 12 Crore Seized: భారీగా బంగారం పట్టివేత.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు!

BSF Foils Smuggling bid: సరిహద్దు భద్రతా బలగాలు ఆదివారం భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 12 కోట్లు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


పశ్చిమ బెంగాల్ లోని భారతదేశం – బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దులో భారీ బంగారు స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భద్రతా బలగాలు(బీఎస్ఎఫ్) విఫలం చేశాయి. రూ. 12 కోట్లు విలువ చేసే 16.07 కిలోల బరువున్న 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని పరగణాల జిల్లాలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని హల్దర్ పద సరిహద్దు గ్రామంలో ఓ అనుమానాస్పద ఇంటిని అన్ని వైపుల చుట్టుముట్టారు భద్రతా బలగాలు. ఇంటిని చుట్టుముట్టిన తరువాత బీఎస్ఎఫ్ అధికారులు, గ్రామంలోని ఇతర నివాసితుల సమక్షంలో ఆ ఇంటిని శోధించారు. ఈ తనిఖీల్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Also Read: ఏంటి.. జూన్ 14 తర్వాత నుంచి ఆధార్ పనిచేయదా.. నిజమెంత ?


అయితే, ఇంతకుముందు కూడా ఇలాగే సరిహద్దు భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించి బంగారం స్మగ్లింగ్ బిడ్ ను విఫలం చేసి రూ. 6.7 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10.73 కిలోల బరువున్న 16 బంగారు కడ్డీలు, నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×