BigTV English

Minister Lokesh: ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తా: మంత్రి లోకేశ్

Minister Lokesh: ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తా: మంత్రి లోకేశ్

AP Minister Lokesh Comments: ఏపీ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్.. ఆ బ్రాండ్ ను చూసి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు. గురువారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియతో మాట్లాడారు. ఏపీలో ప్రజాపాలన వచ్చిందంటూ పారిశ్రామిక వేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేలా అదానీని ఒప్పించామన్నారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించినట్లు లోకేశ్ చెప్పారు. ఎన్ని ఎకరాలు ఎక్కడ అక్రమాలు జరిగాయో అన్ని వివరాలను త్వరలోనే బయటపెడుతామన్నారు. మొన్నటి వరకు విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందన్నారు. కిడ్నాప్ ల జరిగాయి.. అడ్డగోలుగా భూములను లాక్కున్నారన్నారు. అదేవిధంగా విశాఖలో దసపల్లా భూములను కూడా లాగేసుకున్నారన్నారు. కానీ, ఇక ముందు రాజారెడ్డి రాజ్యాంగం నడువదన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలంటూ ఆయన ప్రజలను కోరారు.


Also Read: ముంబై నటి వ్యవహారం.. సీఎం చంద్రబాబు రియాక్ట్, అదొక వై‘కామ’ పార్టీ అంటూ..

ఇదిలా ఉంటే.. కార్మిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దన్నారు. ఫ్యాక్టరీస్ భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ విధానమంటూ ఆయన పేర్కొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలన్నారు. అర్థంపర్థంలేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదన్నారు.


Also Read: జగన్‌పై గరంగరం.. మోపిదేవి నిర్ణయం అప్పుడే.. అందుకే సైకిల్ వైపు..

ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర వాటా నిధులును విడుదల చేస్తామన్నారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్మికులకు రూ. 10 లక్షల బీమాకు త్వరలోనే శ్రీకారం చుడుతామంటూ సీఎం స్పష్టం చేశారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×