E-Paper
Advertisement

Amaravati News: విమానంలో మంత్రి లోకేష్ సీక్రెట్ టూర్లు.. ఆ పేపర్‌లో కథనం, ఆర్టీఐలో బయటకొచ్చిన..

Amaravati News: విమానంలో మంత్రి లోకేష్ సీక్రెట్ టూర్లు.. ఆ పేపర్‌లో కథనం, ఆర్టీఐలో బయటకొచ్చిన..
Advertisement

Amaravati News: అధికారం కోల్పోయినా వైసీపీ ఏమాత్రం తగ్గలేదా? గతంలో అనుసరించిన పంథాను కంటిన్యూ చేస్తోందా? కూటమి సర్కార్‌పై రకరకాలుగా బురద జల్లే ప్రయత్న చేస్తోందా? ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తుందా? చివరకు ప్రభుత్వంలోని కీలక పెద్దల టూర్లపై రకరకాల కథనాలు వండి వార్చుతుందా? అవుననే అంటున్నారు.

విమానంలో మంత్రి లోకేష్ టూర్లు

Advertisement

వైసీపీ రూటు మార్చింది. ఆ పార్టీ అధికార గెజిట్‌లో వచ్చిన రకరకాల కథనాలను ఆధారంగా చేసుకుని.. అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. గతంలో ఇదే విధంగా చేసి సక్సెస్ అయ్యింది. వైసీపీ పాలనలో అసలు నిజాలు తెలియడంతో ప్రజలు షాకయ్యారు. తాజాగా అదే పరిస్థితి కంటిన్యూ చేస్తోంది. తాజాగా మంత్రి లోకేష్‌పై తాటికాయంత అక్షరాలతో ఓ కథనాన్ని ప్రచురించింది.

అసలు మేటరేంటి? మంత్రి నారా లోకేశ్‌ 77సార్లు అమరావతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో తిరిగారని రాసుకొచ్చింది. ప్రభుత్వ సొమ్మును విమాన చార్జీల రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని జగన్‌ పత్రిక ప్రధాన కథనంలో ఆరోపణలు చేసింది. సీఎం చంద్రబాబు బాటలో మంత్రి లోకేష్ పయనిస్తున్నాడని రాసుకొచ్చింది.

Advertisement

18 నెలల్లో 77 సార్లు, అమరావతి టు హైదరాబాద్

అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 18 నెలలపాటు అమరావతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో ట్రావెల్ చేసినట్టు రాసుకొచ్చింది. ఆ లెక్కన వారానికి ఒక్కసారి ఆయన సరదాగా హైదరాబాద్ వెళ్లి గడిపినట్టు పేర్కొంది.  దీనిపై సోషల్ మీడియాలో అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది.

మంత్రి లోకేశ్‌ పర్యటనలపై టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. విమాన చార్జీలకు సొంత సొమ్ము యువనేత వెచ్చిస్తున్నారని చెబుతున్నారు. అయినా చాలామంది ఈ విషయాన్ని నమ్మలేదు. ఈ దుమారం కొనసాగుతున్న వేళ.. ఆర్టీఐ చట్టాన్నిఆశ్రయించారు సామాజిక కార్యకర్త సురేష్‌బాబు . అందులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ: ధర్మవరం తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్స్, స్టేజీపై జనసేన ఫ్లెక్సీలు

ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధనకు వెళ్లిన పర్యటనలకు సొంత నిధులను మంత్రి లోకేష్ వెచ్చిస్తున్నారని తేలింది. కేవలం లోకేష్‌ను టార్గెట్ చేయడం వైసీపీకి ఇదేమీ కొత్త కాదు. చినబాబు చిరుతిండి అంటూ గతంలో జగన్‌ అధికార గెజిట్ రకరకాల కథనాలు వండి వార్చింది. దీనిపై మంత్రి లోకేశ్‌ పరువు నష్టం దావా వేశాయి.

అయినా వారి బుద్ధి ఏ మాత్రం మారలేదని అంటున్నారు. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిన సమయంలో లోకేష్.. హైదరాబాద్‌-ఢిల్లీలో సేద తీరారని ఆ పత్రిక రాసుకొచ్చింది. బుడమేరు కట్ట గండి పూడ్చే పనిని మంత్రి రామానాయుడితో లోకేష్ కలిసి పర్యవేక్షించిన సంగతి మరిచిపోయారని అంటున్నారు. గతంలో చంద్రబాబుపై ఆ పత్రిక విషం చిమ్మిందని, లోకేష్‌పై కూడా అదే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×