Covid Cases: దేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట ఈ మహమ్మారి జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులకు మరణాలు సంభవించడం మరోసారి ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
దేశంలో వణిస్తున్న కొవిడ్ కేసులు- కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. కోట్లాది మంది దీని దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే చాలామంది కరోనా లక్షణాలతో బాధపడుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల కిందట కడపలో కరోనా కేసులు నమోదు కావడం, మరణించడం జరిగింది.
ఏపీలో నలుగురు మృతి-ఇప్పుడు గుంటూరు జిల్లాలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 26 -జూలై 16 వరకు 12 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు. ఈసారి తొలి కోవిడ్ కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదైందని ఆరోగ్య కార్యదర్శి వీరపాండియన్ తెలిపారు.
రాయలసీమలో ఎక్కువ కేసులు-జూలై 1 నుంచి 16 వరకు 11 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 12కు చేరింది. కోవిడ్ కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత గుంటూరు-2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. కోవిడ్ మరణాలలో ముగ్గురు కడప జిల్లాకు చెందినవారు కాగా, ఒకరు కాకినాడ జిల్లాకు చెందినవారు ఉన్నారు.
ఒకే ప్రాంతంలో క్లస్టర్‌గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నమాట. కోవిడ్ వచ్చి మృతి చెందినవారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోవిడ్ సోకిన వారిలో ముగ్గురు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.
నమూనాలు పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు- వైరస్ జన్యు క్రమ విశ్లేషణ కోసం నమూనాలు పుణెలోని వైరాలజీ సంస్థకు పంపించింది ఏపీ ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. మంగళగిరిలో ఇద్దరు మహిళలు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కోవిడ్ కేసులు నమోదైన వారిలో ఒకరిది కేరళ.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్.. ఆ జిల్లాల్లో దంచికొట్టిన వానలు!
కోవిడ్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ తెలిపారు. ప్రజలు నివారణ చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మేము ఆసుపత్రులను, వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుండి 339 కేసులు నమోదయ్యాయి. కేరళ-115, కర్ణాటక-64, మహారాష్ట్ర-43, తమిళనాడు-39, అండమాన్-18, ఢిల్లీ-18, రాజస్థాన్- 12 కేసులు నమోదు అయ్యాయి.