E-Paper
Advertisement

ఏపీని క్షమించండి.. ప్లీజ్ కమ్ బ్యాక్.. అమరరాజాకు మంత్రి లోకేశ్ రిక్వెస్ట్!

ఏపీని క్షమించండి.. ప్లీజ్ కమ్ బ్యాక్.. అమరరాజాకు మంత్రి లోకేశ్ రిక్వెస్ట్!
Advertisement

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి తలమానికంగా నిలిచిన ‘అమరరాజా’ సంస్థకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన వేధింపుల వల్లే అమరరాజా సంస్థ తన తదుపరి పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ వైపు చూడాల్సి వచ్చిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరరాజా వంటి ప్రపంచస్థాయి సంస్థకు ఏపీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని.. రాష్ట్రంలో మళ్లీ సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆయన ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.

4 దశాబ్దాల ప్రస్థానం

అమరరాజా గ్రూప్ కేవలం ఒక బ్యాటరీల తయారీ సంస్థ మాత్రమే కాదని.. అది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి సజీవ సాక్ష్యమని ఎక్స్ లో నారా లోకేశ్ పేర్కొన్నారు. గత 4 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిందన్నారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి, ఇక్కడి ప్రజలకు జీవనోపాధి కల్పించాలనే గల్లా కుటుంబం తపనకు ఈ సంస్థ నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు.

ఏపీ పారిశ్రామిక రంగానికి దెబ్బ

Advertisement

గత వైసీపీ హయాంలో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా అమరరాజా సంస్థ తీవ్ర వేధింపులను ఎదుర్కొంది. కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు, విద్యుత్ కనెక్షన్ల నిలిపివేత వంటి వరుస చర్యలతో సంస్థను ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రగతిని సాధించాలనుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం అందించాల్సింది పోయి, బెదిరింపులకు గురిచేయడం అత్యంత దురదృష్టకరం’ అని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ వేధింపుల వల్లే సంస్థ తన భారీ గిగాఫ్యాక్టరీ ప్రాజెక్టును తెలంగాణకు తరలించాల్సి వచ్చిందని ఇది ఏపీ పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

ఏపీకి స్వాగతం..!

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని నింపేందుకు శ్రమిస్తోందని నారా లోకేశ్ అన్నారు. ‘పరిశ్రమలకు బెదిరింపులు కాదు.. ప్రోత్సాహకాలు కావాలి’ అనేదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణలో కొత్త ప్లాంట్ ప్రారంభించిన గల్లా జయదేవ్ అమరరాజా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఏపీలో మరో సమున్నత అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు.

Also Read: జగన్ చేతికి కొత్త డిజిటల్ అస్త్రం.. Jagan 2.0 Super App లాంచ్.. దేనికోసమంటే?

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×