BigTV English

Praja Darbar: మంగళగిరిలో ప్రజా దర్బార్.. ప్రజల నుంచి అనూహ్య స్పందన

Praja Darbar: మంగళగిరిలో ప్రజా దర్బార్.. ప్రజల నుంచి అనూహ్య స్పందన

Minister Nara Lokesh Praja Darbar: మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తక్షణ కర్తవ్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. మంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో కూడా నిర్వహించాలని వివిధ జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలో నాలుగు రోజులుగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.


ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పారా మెడికల్, ఆర్‌ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి తరహాలోనే తమ జిల్లాల్లో నేతలు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చే సమస్య ఉండదని చెబుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్‌కు తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

Also Read: సంచలన ట్వీట్ చేసిన నారా భువనేశ్వరి


ప్రజా దర్బార్‌కు వస్తున్న వారికి మంత్రి లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న లోకేష్ ప్రజా దర్బార్‌కు ప్రజలతో పాటు, పలువురు ఉద్యోగులు, మీ సేవా నిర్వాహకులు సైతం వస్తున్నారు.

Related News

Driver Subramaniam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ, నిందితుడు అనంతబాబు భార్యకు నోటీసులు

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

Big Stories

×