BigTV English

Payyavula Keshav on Jagan: జగన్ ప్రతిపక్షానికి నాయకుడు మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదు: మంత్రి పయ్యావుల కేశవ్!

Payyavula Keshav on Jagan: జగన్ ప్రతిపక్షానికి నాయకుడు మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదు: మంత్రి పయ్యావుల కేశవ్!

Minister Payyavula Keshav Comments on Jagan: జగన్ ప్రతిపక్షానికి నాయకుడు మాత్రమే కానీ.. ప్రతిపక్ష నేత కాదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. బుధవారం ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం తర్వాత ప్రతిపక్షనేత ప్రమాణ స్వీకారం చేయాలని అన్న జగన్ కు అసలు సభ నియమాలు తెలుసా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో ఉండేందుకు కనీస మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా లేని వైసీపీ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. అసలు జగన్ కు ఇలాంటి సలహా ఇచ్చిందెవరో ఒకసారి అన్నీ తెలుసుకుని సలహాలివ్వాలని సూచించారు. అలాంటి వాళ్ల సలహాలు తీసుకుంటే వైసీపీ పూర్తిగా మునిగిపోతుందన్నారు.


జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేదని, అందుకే సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారన్నారు. ప్రతిపక్ష హోదా రావాలంటే.. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ఆ హోదా దక్కుతుందని చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా మాట్లాడిన జగన్.. ఇప్పుడు కూడా తనకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రజలు అసలు అధికారం తీసేసినా.. కొసరు అధికారం కోసం ప్రాకులాడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని చెప్పారు.

ప్రతిపక్ష నేతగా ఉంటే.. క్యాబినెట్ హోదా ఉంటుందని జగన్ భావిస్తున్నారని, అందుకోసమే ఎత్తులేస్తున్నారని విమర్శించారు. 1994లో ఉపేందర్ కు పార్లమెంట్ లో అసలు ప్రతిపక్షనేత హోదానే ఇవ్వలేదని, ఆయనను ఫ్లోర్ లీడర్ గా మాత్రమే పేర్కొన్నారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందటానికి దాదాపు పదేళ్లు పట్టిందని తెలిపారు.


Also Read: YS Jagan Master Plan: యూటర్న్ తీసుకున్న జగన్.. స్పీకర్ ఎన్నికలో బీజేపీకి మద్దతు.

మొన్నటి వరకూ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదన్న వారు.. ఇప్పుడు 10 శాతం నిబంధన లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ ప్రజా తీర్పును గుర్తించలేనట్లుగా ఉన్నారని, ఇకనైనా ఓటమిని అంగీకరించి అసెంబ్లీ రూల్ బుక్ చదివి అన్ని నిబంధనలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలు, పార్లమెంట్ లో పాటించే నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటర్ లకు సంబంధించిన నిబంధనలు ఉండే కౌల్ అండ్ షఖ్దర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ లను చదవాలన్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×