Upasana: ఉపాసన కొణిదెల(Upasana Konidela) పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా, రామ్ చరణ్(Ram Charan) భార్యగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఉపాసన కూడా తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీ బిజీగా ఉంటారు. ఇలా ఎన్నో వ్యాపారాలను చూసుకుంటూ వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండే ఉపాసన తన వ్యక్తిగత జీవితంలో తనకంటూ కూడా ఎంతో సమయాన్ని కేటాయించుకుంటారని తెలుస్తోంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఉన్నటువంటి ఒక అలవాటు గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇంటర్వ్యూ సందర్భంగా మీ గురించి ప్రజలకు తెలియని విషయం ఏదైనా ఉందా అంటూ ప్రశ్న ఎదురైంది.
క్యాండీ క్రష్ ఆడే అలవాటు..
ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెబుతూ.. నేను నా కోసం చాలా సమయం కేటాయిస్తానని తెలియజేశారు. ఆ విషయంలో తాను చాలా గర్వంగా ఫీల్ అవుతానని వెల్లడించారు. మీకు ఏది నచ్చుతుందో ఆ పని చేయండని సలహా ఇచ్చారు. అదేవిధంగా తాను కూడా క్యాండీ క్రష్(Candy Crush) ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ తనకు గంటల తరబడి క్యాండీ క్రష్ ఆడే అలవాటు ఉందని బయటపెట్టారు. ఇలా ఉపాసన తన కోసం ఎంతో సమయం కేటాయిస్తానని చెప్పడమే కాకుండా క్యాండీ క్రష్ ఆడతానని చెప్పడంతో ఉపాసన కూడా మన బ్యాచ్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
గోల్డెన్ వీసా అందుకున్న ఉపాసన..
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఇష్టమైన హాలిడేస్ స్పాట్ గురించి కూడా ప్రశ్న ఎదురవడంతో తనకు దుబాయ్ అంటే చాలా ఇష్టమని అక్కడికి చాలాసార్లు వెళ్లానని తనకు గోల్డెన్ వీసా కూడా వచ్చిందని తెలిపారు. అక్కడ షాపింగ్ చేయడం అంటే కూడా తనకు చాలా ఇష్టమని ఉపాసన వెల్లడించారు. ఇలా తన అలవాట్ల గురించి తన ఇష్టా ఇష్టాల గురించి ఉపాసన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు భిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన చాలామందికి ఇన్స్పిరేషన్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్ పర్సన్..
ఇక ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి వివాహ సమయంలో ఇద్దరి గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చిన ప్రస్తుతం మాత్రం ఈ జంట అందరికీ ఎంతో ఆదర్శంగా ఉందని చెప్పాలి. ఇక ఈ దంపతులకు గత రెండు సంవత్సరాల క్రితం క్లిన్ కారా (Klin kaara)జన్మించిన విషయం తెలిసిందే . ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా తెలంగాణ స్పోర్ హబ్ కో చైర్ పర్సన్ గా కూడా ఇటీవల బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే