BigTV English

AP: సైకిల్ సింగిల్‌గానా? జనసేనతోనా? వాట్ నెక్ట్స్? ఎమ్మెల్సీ ఇంపాక్ట్..

AP: సైకిల్ సింగిల్‌గానా? జనసేనతోనా? వాట్ నెక్ట్స్? ఎమ్మెల్సీ ఇంపాక్ట్..

AP: టీడీపీకి ఇప్పుడు వెయ్యి ఏనుగుల బలం. పార్టీకి అత్యంత ఊపు ఇచ్చే విజయం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలనూ స్వీప్ చేసింది. ఎమ్మెల్యే కోటాలోనూ అనూహ్యంగా ఎమ్మెల్సీ గెలిచింది. వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా విజయ దుందుభి మోగించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అందివచ్చిన ఈ విజయం.. టీడీపీలో అంతులేని ఉత్సాహం తీసుకొచ్చింది. మామూలు విజయమా ఇది.


వైసీపీ ఇప్పుడు తీవ్ర అవమాన భారంలో మునిగిపోయింది. కీలకమైన నాలుడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమిపాలై పరువు పోగొట్టుకుంది. టీడీపీ అక్రమాలకు పాల్పడిందంటూ అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

వాట్ నెక్ట్స్. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎమ్మెల్సీ గెలుపు ఇచ్చిన జోష్‌తో మరింత దూకుడు పెంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందా? ఎందుకైనా మంచిదని జనసేన స్నేహ హస్తాన్ని అందుకుంటుందా? అనేదానిపై చర్చ మొదలైంది.


టీడీపీ.. జనసేనతో పొత్తు కోసం అంతగా ఏమీ ఆరాటపడటం లేదు. పొత్తు పెట్టుకుంటే.. జనసేనకు చెప్పుకోదగ్గ స్థానాలు కేటాయించాల్సి వస్తుందని టీడీపీ సైడ్ అయిపోతోంది. తక్కువ సీట్లు ఇస్తే ఒప్పుకోమని పవన్ ఇప్పటికే చెప్పేశారు.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. తాము సింగిల్‌గానే గెలుస్తామనే నమ్మకం టీడీపీకి కలుగుతోంది. అదే జరిగితే.. జనసేనతో పొత్తు కష్టమే అంటున్నారు. అది పరోక్షంగా వైసీపీకి లాభం చేయొచ్చు.

దమ్ముంటే అన్నిస్థానాల్లో పోటీ చేయాలంటూ పవన్ కల్యాణ్‌ను పదే పదే కవ్విస్తోంది అధికార పార్టీ. జనసేనాని మాత్రం మిస్టర్ కూల్‌గా ఉన్నారు. తాము ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తే మీకేంటి? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొదట్లో టీడీపీతో పొత్తుపై చాలా ఉత్సాహం కనబరిచిన పవన్.. కొన్నాళ్లుగా కాస్త తగ్గారు. అవసరమైతే, ప్రజలు భరోసా ఇస్తే.. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు వేరు వేరుగా పోటీ చేస్తే.. వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభం జరగొచ్చు. కానీ, ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే..? ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్ కావనే గ్యారంటీ అయితే లేదు. అందుకే, జగన్‌లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. “ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు”.. అంటూ జగన్ ఇప్పటికే తనలోని ఉక్రోషాన్ని వెల్లగక్కుతున్నారు. జగన్ మాటల్లో టీడీపీ, జనసేనల పొత్తుపై భయం స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.

చంద్రబాబు, పవన్ కలిసి బరిలో దిగితే..? సంచలన ఫలితాలే రావొచ్చు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ విజయాలతో జోరు మీదున్న టీడీపీ.. జనసేనతో పొత్తుకు ఏమేర ముందుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×