EPAPER

Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi: విశాఖలోని ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో విశాఖను ప్రత్యేక నగరంగా పేర్కొన్నారు. ప్రాచీనకాలంలోనే విశాఖ ఓడరేవు వ్యాపార కేంద్రంగా విరాజిల్లిందని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉందన్నారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని గుర్తుచేశారు.


విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఓడరేవు ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుందోన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబు పేర్లను మోదీ ప్రస్తావించారు. ఏపీ, వైజాగ్‌ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వాళ్లపై ప్రశంసలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకలో పాల్గొనే విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలకు గుర్తింపు ఉందన్నారు. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని ప్రశంసించారు. స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారని కితాబిచ్చారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారన్నారు. సాంకేతిక, వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. విశాఖ నగరం గొప్పతనాన్నీ వివరిస్తూ ఏపీ ప్రజలను ప్రశంసించిన ప్రధాని.. రాష్ట్రానికి కొత్త వరాలు ప్రకటించలేదు.రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి హామీలివ్వలేదు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిధుల గుర్తించి ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా పెదవి విప్పలేదు. ఎలాంటి స్పష్టమైన హామీలు ఇవ్వలేదు.


వికసించిన భారత్‌ అనే అభివృద్ధి మంత్రంతో దేశం ముందుకెళ్తోందని ప్రధాని అన్నారు. సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచనగా చెప్పారు. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ ఆవిష్కరిస్తున్నామన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధి విషయంలో ముందుంటున్నామన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయిని చెప్పారు. సామాన్య మానవుడి జీవితం మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా మోదీ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్‌ వైపు చూస్తోందని తెలిపారు. ఎప్పుడైతే పేదవాళ్లకు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుందో అప్పడే వికసించిన భారత్‌ కల సాకారమవుతుందని మోదీ స్పష్టం చేశారు.

Related News

Pavan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్..

Anchor Shyamala: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్లాన్ అంతా ఆ సినిమా చూసే చేశారా ?

Vijayasai Reddy: మళ్లీ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..

Balakrishna vs YS Jagan: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

Mumbai actress kadambari case: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Big Stories

×