BigTV English

Mopidevi: జగన్‌కు ఝలక్? రేపో మాపో టీడీపీ గూటికి మోపిదేవి, ఎందుకంటే..

Mopidevi: జగన్‌కు ఝలక్? రేపో మాపో టీడీపీ గూటికి మోపిదేవి, ఎందుకంటే..

Mopidevi: నటుడు సాయికుమార్ నటించిన ప్రస్థానం సినిమా అందరికీ తెలుసు. అధికారానికి అలవాటుపడిన రాజకీయ నేతలు ఎలా ఉంటారన్నది. ఆ విషయం తెలియక వైసీపీ అధినేత జగన్.. వివిధ నేతలను ఆడిపోసుకున్నారు. ఇదంతా గతం.. సీన్ రివర్స్ అయ్యింది.. ఏపీలో రాజకీయాలు తారుమారు అయ్యారు.


అధికారం కోల్పోయాక వైసీపీ నేతలు కేడర్‌ను కాపాడుకునేందుకు తలో దిక్కు చెదిరిపోతున్నారు. ఐదేళ్లు కేడర్ కాపాడుకోవడమన్నది ఆశామాషీ విషయం కాదు. దీన్ని గమనించిన ఫ్యాన్ పార్టీకి చెందిన కొందరు టీడీపీ, జనసేన, బీజేపీ వైపు తొంగి చూస్తున్నారు. మరికొందరు పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు.

తాజాగా వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై సిద్ధమయ్యారు. టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మంత్రి అనగాని, మోపిదేవి ఇద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా.


ALSO READ: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?

గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి మోపిదేవికి టికెట్ ఆశించారు. కానీ, జగన్.. గణేష్‌కి సీటు ఇచ్చారు. దీంతో పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మార కుంటే కష్టమని భావించారు. అంతేకాదు కేడర్ నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే గురువారం సైకిల్ ఎక్కడం ఖాయం.

మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మోపిదేవి ఆది నుంచి వైఎస్సార్‌కు విధేయుడిగా ఉన్నారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆయన మరణం తర్వాత జగన్ వైపు వెళ్లారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఆయన పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనను ఎమ్మెల్సీ చేసిన జగన్, మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు.

ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలను మోపిదేవి గమనిస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ కోలుకోవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు. తోడుగా నిలిచిన కేడర్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో పార్టీ మారాలనే నిర్ణయానికి రావడం, టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లడం జరిగింది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్గత సమాచారం.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×