BigTV English

Mother Kills Baby: ఇంటి నుంచి పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడ్చిన చిన్నారి.. ఆ పాపని నిర్దాక్షిణ్యంగా..!

Mother Kills Baby: ఇంటి నుంచి పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడ్చిన చిన్నారి.. ఆ పాపని నిర్దాక్షిణ్యంగా..!

Mother Kills Baby| మానవ సంబంధాలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయని చెప్పడానికి ఉదాహరణగా ఇటీవల దారుణమైన ఘటన జరిగింది. ఉదయం పనికి వెళ్లిన భర్త.. రాత్రి ఇంటికి రాగానే.. ఇంట్లో ఎవరూ లేరు. తన భార్య, మూడేళ్ల పాప ఎక్కడికి పోయారో కనిపించలేదు. తన బావమరిదితో కలిసి ఎంతసేపు గాలించినా కనబడక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఇంటి వెనుక ఒక సూట్ కేసులో పాప శవం ఒళ్లంతా రక్తంతో కనిపించింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ర్టంలోని ముజఫర్ పూర్ జిల్లా మిఠన్ పురా ప్రాంతంలో మనోజ్ కుమార్ (28) తన భార్య కాజల్ కుమారి(24), మూడేళ్ల కూతురు మిష్టితో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే గత శుక్రవారం ఉదయం మనోజ్ కుమార్ ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లాడు. అయితే భర్త వెళ్లిన తరువాత అతని భార్య కాజల్ కుమారి మధ్యాహ్నం ఒక బ్యాగు తీసుకొని ఇంటిని బయలుదేరింది. కానీ వెళ్లకముందు పక్కింటి వారికి తాను బంధువుల ఇంటికి బర్తడే పార్టీకి వెళుతున్నట్లు.. రాత్రి లేటుగా వస్తానని చెప్పింది.

రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన భర్త మనోజ్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తన భార్యకు ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తోంది. దీంతో మనోజ్ కంగారు పడ్డాడు. అతడిని చూసిన పక్కింటి వారు మీ భార్య కాజల్ ఏదో బర్త్ డే పార్టీకి వెళ్లిందని తెలిపారు. అది విని మనోజ్ వెంటనే కాజల్ సోదరుడు, తన బావమరిది శ్రీకాంత్ కు ఫోన్ చేశాడు. కాజల్ ఎక్కడికి వెళ్లింది? మీ ఇంటికేమైనా వచ్చిందా? అని ప్రశ్నించాడు. కానీ అతని బావమరిది తనకేమీ తెలయదని, కాజల్ తన ఇంటికి రాలేదని చెప్పాడు. కాజల్ కోసం తన బావ కంగారు పడడం చూసి శ్రీకాంత్ కూడా మనోజ్ తో కలిసి కాజల్ కోసం రాత్రంతా వెతికారు. కానీ ఎక్కడా కాజల్ ఆచూకీ తెలియలేదు.


Also Read: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

అప్పుడు వారిద్దరూ పోలీస్ స్టేషన్ వెళ్లి కాజల్ కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసుల ఇంటి పరిసరాల్లో అంతా వెతికారు. అయితే ఇంటి వెనకాల ఒక ఎర్రని సూట్ కేస్ కనిపించింది. ఆ సూట్ కేస్ తనదే నని మనోజ్ చెప్పడంతో పోలీసులు దాన్ని తెరిచి చూడగా.. అందులో మనోజ్ మూడేళ్ల కూతరు మిష్టి శవం కనిపించింది. మిష్టి గొంతు కోసి హత్య చేసిన తరువాత ఆ సూట్ కేసులో బంధించి.. ఇంటి వెనుక ఉన్న ఒక గుంతలో సూట్ కేసు పారేశారు. అది చూసి పోలీసులు కాజల్ మిస్సింగ్ కేసుని హత్య కేసుగా విచారణ చేయడం ప్రారంభించారు.

ముందుగా కాజల్ ఫోన్ డేటా పరిశీలించగా.. ఆమె ఒక నెంబర్ కు ఎక్కువ ఫోన్ కాల్స్ చేసింది. ఆ నెంబర్ ఎవరిదని విచారణ చేయగా.. అవధేశ్ అనే వ్యక్తితో కాజల్ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతోందని తెలిసింది. ఇక పోలీసులు అవధేశ్ నివసిస్తున్న రామ్ పూర్ హరి అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అవధేశ్ ఇంట్లో కాజల్ కూడా ఉంది. పోలీసులు చిన్నారి మిష్టి హత్య కేసులో కాజల్, ఆమె ప్రేమికుడు అవధేశ్ ని అరెస్టు చేశారు.

పోలీసులు పాపను అవధేశ్ హత్య చేశాడని అనుమానించి.. అతడిని గట్టిగానే ప్రశ్నించారు. కానీ పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అవధేశ్, కాజల్ పెళ్లికుముందు నుంచే ప్రేమించుకుంటున్నారని,.. అయితే కాజల్ తనతో కలిసి ఉండాలని కోరుకోవడంతో ఇద్దరూ పారిపోయేందుక సిద్ధపడినట్లు తెలిపారు. కానీ కాజల్ కూతురు తమతో రావడం తనకు ఇష్టం లేదని అవధేశ్ చెప్పాడు. పాపను ఇంట్లో వదిలేసి వస్తేనే తనను స్వీకరిస్తానని అవధేశ్ చెప్పడంతో.. ప్రేమ, కామం తో కళ్లు మూసుకుపోయిన కాజల్ తన సొంత కూతురుని కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఆ తరువాత సూట్ కేసులో పాప శవం పెట్టి ఇంటి పై నుంచి ఇంటి వెనకాల పడేసింది.

కాజల్.. పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో అవధేశ్ హత్య చేయలేదని తేలింది. పోలీసులు ప్రస్తుతం కాజల్ పై హత్య కేసు నమోదు చేశారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×