BigTV English

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?

Nuziveedu IIIT: ఇటీవల కాలంలో స్కూళ్లు, విద్యాసంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం పెట్టే ఆహారమైనా, ఫీజులు తీసుకుని వండిపెట్టే ఫుడ్ అయినా సరే.. క్వాలిటీ ఉండటం లేదు. నిల్వ ఉంచిన, నాసిరకం ఆహారం విద్యార్థులకు పెడుతుండటంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.


తాజాగా ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఒకేసారి 800 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గడిచిన మూడ్రోజుల్లో సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కమిటీ వేశామని, విచారణ జరుగుతోందని కళాశాల అధికారి తెలిపారు.

Also Read: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.


మరోవైపు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో ఉన్న బాలికల గురుకుల విద్యాలయంలోనూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 62 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురుకులంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఉందని, ఆహారం కూడా నాణ్యంగా లేదంటున్నారు తల్లిదండ్రులు.

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను హెచ్చరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×