MP Avinashreddy: వైసీపీ నేతలకు కష్టాలు వెంటాడుతున్నాయా? అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు కంటి మీద కునుకు పట్టడం లేదా? హైకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చాడు అవినాష్‌రెడ్డి పీఏ రాఘువరెడ్డి. విచారణకు రావాలంటూ కడప పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు హాజరవుతాడా? కీలక విషయాలు బయటపెడితే అవినాష్ అరెస్ట్ ఖాయమనే చర్చ కడపలో జోరుగా సాగుతోంది.
వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. ఏ రూపంలో కేసులు నమోదు అవుతాయోనని బెంబేలెత్తుతున్నారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41 A ప్రకారం నోటీసులు ఇచ్చారు కడప పోలీసులు. సోమవారం ఉదయం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని అందులో ప్రస్తావించారు.
సోషల్‌మీడియా కేసుల నేపథ్యంలో కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు రాఘవరెడ్డి. ఈయన ముందస్తు బెయిల్ పిటీషన్ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈనెల 12వరకు ఎలాంటి కఠిన చర్యలు వద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో విచారణకు రాఘవరెడ్డి వెళ్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విచారణకు ఆయన వెళ్లకుంటే న్యాయస్థానంలో ఇదే విషయాన్ని ప్రస్తావించి అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు. హాజరైతే విచారణకు సహకరించ లేదని అదుపులోకి తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఎలా చేసినా రాఘువరెడ్డి అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
ALSO READ: అధికారం లేకుంటే ఇన్ని కష్టాలా? వైసీపీకి మరో మాజీ మంత్రి గుడ్ బై?
విచారణలో రాఘువరెడ్డి నోరు విప్పతే అవినాష్‌రెడ్డి పాత్ర బయటకు రావడం ఖాయమని భావిస్తున్నారు. సోషల్‌మీడియా పోస్టుల వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ ఆయనే అంటూ ప్రచారం సాగుతోంది. తొలుత రాఘవరెడ్డి విచారించాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అవసముంటే రవీంద్రారెడ్డిని విచారణకు తీసుకుని ఇద్దర్నీ కలిపి విచారించాలనే ఆలోచన చేస్తున్నారట పోలీసులు.
ఏ విధంగా చూసినా అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ కేసు కాసేపు పక్కనబెడితే, వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయ ముందని ఇప్పటికే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివేకానంద పీఎ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అటువైపు నుంచి విచారణ మొదలుపెట్టారు. మొత్తానికి అవినాష్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.