Gundeninda GudiGantalu Today episode December 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో బాలు టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. మీనా అతనికి టిఫిన్ వడ్డిస్తుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు.. మొత్తం వాడికే వడ్డించకంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు. ఈ సమయంలో ప్రభావతి.. ఏం చేస్తున్నావ్ అంటూ రోహిణి తో మాట్లాడుతుంది. తాను అకౌంట్స్ చూస్తున్నానని, రేపు మేడం వస్తుందంటూ రోహిణి నోరు జారుతుంది. నువ్వే కదా పార్లర్ కు మేడం.. మళ్లీ మేడం అంటున్నావు అని అడుగుతుంది ప్రభావతి. మేడం అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని, ఆమె వచ్చి ఆడిటింగ్ చేస్తుందంటూ కవర్ చేస్తుంది. దీంతో ప్రభావతి.. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారు అంటుంది. దీంతో రోహిణి కూడా షాక్ అవుతుంది. అలా అంటున్నారేంటీ.. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. హ చేస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. కానీ బాలు వాళ్లకు రోహిణి మీద అనుమానం మొదలవుతుంది. రోహిణి ఏదో కవర్ చేసుకోవాలని ఏదో ఒకటి చెప్తుంది. అవును ఆంటీ ఇంతకీ మనోజ్ మీకు డబ్బులు ఎంత ఇస్తున్నాడు అనేసి అడగని మనోజ్ షాక్ అవుతాడు. అబద్ధాలు చెప్పడం కంటే జాబ్ చేయడమే ఈజీగా ఉందని మనసులో అనుకుంటాడు. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తినడం అవుతుంది. సత్యం కనిపించట్లేదని బాలు మీనాను అడుగుతాడు. ఏమో అండి టిఫిన్ కూడా చేయలేదు బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు అనేసి మీనా అంటుంది. అప్పుడే సత్యం ఇంట్లోకి వస్తాడు అరె తినడం అయిపోయిందా అయితే బయటికి రా అర్జెంటుగా నీకు ఒకటి చూపించాలి అనేసి హడావిడి చేస్తాడు. నువ్వు ఇప్పటివరకు చాలా చేసావు నా ప్రాణాల్ని కోసం వస్తే నా ప్రాణాన్ని కాపాడ్డానికి నీ ప్రాణమైన కారణం ఏశావు అందుకే నీకు ఇదిగో గిఫ్ట్ ఇచ్చాను అనుకో అనేసి అంటాడు. బాలు కారం చూసి ఎమోషనల్ అయిపోతాడు. బాలు సంతోషంలో మునిగిపోతాడు. ఈ కార్ ది నమ్మేసాను కదా నాన్న మీకు ఎలా వచ్చింది ఎవరిచ్చారు అయినా ఒకసారి నడుపుకోమని ఇచ్చారా ఏంటి అనేసి అడుగుతాడు. పక్కనే ఉన్న బాలు ఫ్రెండ్ బాబాయ్ నీకోసం ఈ కారును కొన్నాడు అనేసి చెప్తాడు. మళ్లీ ఎందుకు నాన్న నువ్వు ఇంత డబ్బులు పోసి మళ్ళీ కొన్నావు అనేసి అనగానే ప్రభావతి కౌంటర్లు ఇస్తుంది. నాకోసం నువ్వు అమ్మావురా అందుకే నేనే దీని కొన్నాను అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మీనాకిచ్చి ఇదిగో అమ్మ నీ చేత్తో తాళాలు ఇస్తే మంచిది అని బాలుకి ఇవ్వమని చెప్తాడు. మీనా వల్లే కారు పోయింది ఇప్పుడు మీనా వల్లే కారు వచ్చిందని బాలు కూడా అనుకుంటాడు. కారు తీసుకురావడానికి అంత డబ్బులు మీకు ఎలా వచ్చాయి నాన్న అని బాలు అడుగుతాడు. నాకోసం నువ్వు చూసుకున్నావు నీకోసం నేను చూడకపోతే ఎలా తండ్రికి అర్థం వేరే అయిపోతుంది అనేసి సత్యం అంటాడు. కానీ బాలు మాత్రం అంత డబ్బులేసి మళ్లీ తీసుకోకపోతే ఏమైంది నాన్న అనేసి బాధపడతాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ కాస్త ఎపిసోడ్కి హైలైట్ అవుతుంది. ఇక మీనాన్ని తీసుకొని అలా బయటికి వెళ్ళేసి రా అప్పు అనేసి సత్యం వాళ్ళిద్దర్నీ పంపిస్తాడు.
బాలుకు అంత డబ్బులు ఇచ్చి మళ్లీ కారు కొని ఇవ్వాల్సిన అవసరం ఏంటని మనోజ్ అడుగుతాడు.. నాకు ఒక్కమాట కూడా ఇప్పలేదు అనగానే సత్యం కోపంగా ఉంటాడు. ప్రభావతి కూడా వాళ్లకి వత్తాసు పలుకుతుంది. ఇక మీనా మామయ్య ఆపరేషన్ కోసం డబ్బులు కోసమే కారమ్మాడు ఇప్పుడు మావయ్య తెచ్చి ఇచ్చాడు మధ్యలో మీదేంటి అని అంటుంది. ఇక మీనా తీసుకొని బయటికి వెళ్ళమని సత్యం పంపిస్తాడు. మీనా ను తీసుకొని బయటికి వెళ్లిన బాలు తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన ఫ్రెండుని మీనాక్షి సారీ చెప్పాలని నువ్వు ఈ మాట చెప్పు అనేసి చెప్తాడు. వాడు నీతో ఏదో చెప్పాలంటమ్మా అనేసి అతను అంటాడు. ఏంటి అన్నయ్య అంటే.. నీవల్లే కారు పోయింది నీవల్లే కార్ వచ్చిందని వాడు సంతోష్ పడిపోతున్నాడనేసి అతను చెప్తాడు. ఆ మాటేదో అతనే చెప్పొచ్చు కదా అనేసి మీనా అంటుంది. మరోవైపు మీనా ను ఫాలో చేస్తూ మనోజ్ వెళ్తాడు. పార్లర్ లో పనిచేస్తున్న విషయం మనోజ్ కి తెలిసినట్టు ఉంటుంది. మరి ఆ విషయాన్ని బయట పెడతాడా లేదా చూడాలి.. ఇక రవి శృతి ఇద్దరూ తినడానికి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే రవి వంట మనిషి లాగా అవి ఇవి అనేసి చెప్తాడు.. నువ్వు చెప్తే తిన్నట్టే కానీ అనేసి శృతి తన కావాల్సింది తానే ఆర్డర్ చేసుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో కామాక్షి ప్రభావతి రవిని ఇంట్లోకి ఎలా రప్పించాలని ఆలోచిస్తూ ఉంటారు. సత్యంతో అంటారు మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి..