BigTV English

Political News in AP: హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట.. ఈ సారి ఎడబాటు తప్పదా..

Political News in AP: హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట.. ఈ సారి ఎడబాటు తప్పదా..

MP Magunta Srinivasulu Reddy Vs Balineni Srinivasa Reddy


హిట్ కాంబినేషన్ అనిపించుకున్న బాలినేని, మాగుంట టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
కుమారుడ్ని ఎన్నికల బరిలో దింపుతున్న మాగుంట వైసీపీ టికెట్‌తో మరోసారి పోటీకి సిద్దమైన బాలినేని
2014లో తొలిసారి పరాజయం పాలైన బాలినేని టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాగుంట 3 సార్లు సక్సెస్ అయిన మాగుంట, బాలినేని కాంబినేషన్ ఇద్దరి మధ్య కొనసాగుతూనే ఉన్న స్నేహబంధం వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్న నేతలు మాగుంట కుమారుడు చరిత్ర తిరగరాస్తారా?


Also Read: అభివృద్ధిని పట్టించుకోని పుష్ఫశ్రీవాణి.. విజయంపై ఎందుకంత ధీమా.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలది విడదీయరాని బంధమనే చెప్పాలి. వారిద్దరూ ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్‌కు మరోసారి బ్రేక్ పడింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఈ సారి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగారు. బాలినేని కూడా పార్టీ అధిష్టానంపై అసంత‌ృప్తితో ఉన్నప్పటికీ. గత్యంతరం లేక ఒంగోలు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీకి సిద్దమయ్యారు. అలా వారిద్దరి కాంబినేషన్ విడిపోయినా. ఉన్న తమ స్నేహబంధాన్ని మాత్రం వదులుకోక పోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది

1999 నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్క సారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా వైవీ సుబ్బారెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బాలినేని తొలిసారి ఓటమి మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మాగుంట ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకు ముందు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాగుంట, బాలినేని ఇద్దరూ గెలుపొందారు. 2019లోనూ వైసీపీ అభ్యర్ధులుగా వారి కాంబినేషన్‌ ఒంగోలులో హిట్ కొట్టింది.

Also read: సిట్టింగ్ కే సీటు.. పుట్టపర్తిలో పొలిటికల్ హీట్

2014 ఎన్నికల్లో ఓటమికి తమ కాంబినేషన్ మిస్ అవ్వడమే కారణమని భావించిన బాలినేని, మాగుంటలు 2019లో పట్టుబట్టి మరీ టికెట్లు దక్కించుకున్నారు. దాంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వారిద్దరికీ తిరుగులేదనే టాక్ రాజకీయ వర్గాల్లో నడిచింది. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆ ఇద్దరు కలిసి వైసీపీ నుంచే పోటీ చేయాలని భావించినా జగన్ నిర్ణయంతో ఆ జోడీ విడిపోవాల్సి వచ్చింది. మాగుంట స్థానంలో ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కేటాయించడంతో వారి మధ్య రాజకీయ బంధం మళ్లీ తెగిపోయింది .. తన రాజకీయ మిత్రుడు టికెట్ కోసం బాలినేని అధిష్టానం పై ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్ మాత్రం మాగుంటకు టికెట్ కేటాయించేందుకు ససేమిరా అనడంతో.. ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది ..

తాను పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవడానికి ఫిక్స్ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి.. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీ లోకి దింపారు .. మాగుంట వెంట బాలినేని నడుస్తారని భావించినా.. బాలినేని మాత్రం వైసీపీ నుంచే ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమయ్యారు ..

 

Tags

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×