E-Paper
Advertisement

Konaseema District: ఇంట్లోకి చొరబడి‌ టెన్త్ విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు

Konaseema District: ఇంట్లోకి చొరబడి‌ టెన్త్ విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు
Advertisement

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిపై కాలాడి సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

బాలిక తల్లి పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఇదే అదనుగా భావించిన ఇంటి సమీపంలో ఉండే కాలాడి సతీష్ అనే యువకుడు బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి తిరిగి ఇంటికి చేరుకుని గాలించగా.. తర్వాత బాలిక లభ్యమైంది. బాలిక వద్ద విషయాలు తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరైంది. తన కూతురుకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

వెంటనే బాలిక తల్లి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురికి న్యాయం చేయాలని.. నిందితుడు సతీష్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుకుంది.

Advertisement

ఈ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు న్యాయం జరగాలని నిందితుడికి తక్షణమే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×