Gun Fire in Pileru(Latest news in Andhra Pradesh): అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ నేత గిరినాయుడిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. తుపాకులతో దుండగులు గిరినాయుడుపై హత్యాయత్నానికి తెగబడ్డారు. అయితే.. గిరినాయుడు తిరగబడటంతో దుండగులు వెనకడుగేశారు. తుపాకీ వదిలేసి పరారయ్యారు.దీంతో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గిరినాయుడు కావలిపల్లె టీడీపీ ఇన్ చార్జ్‌గా పనిచేస్తున్నారు. ముఖాలకు మంకీ క్యాప్‌లు, చేతులకు నల్లని గ్లౌవ్స్ ధరించిన దుండగులు గిరినాయుడు ఇంట్లోకి చొరబడ్డారు. అయినా.. గిరినాయుడు కుటుంబసభ్యులు ధైర్యంగా ముసుగు వ్యక్తులపై తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తుపాకీ వదిలేసి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ముసుగు వ్యక్తులెవరు? ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డారు? అన్న కోణంలో విచారణ చేపట్టారు.