E-Paper
Advertisement

Chittoor: చిత్తూరులో దారుణం.. డ్రైవర్‌పై బస్సు ఎక్కించిన మరో డ్రైవర్

Chittoor: చిత్తూరులో దారుణం.. డ్రైవర్‌పై బస్సు ఎక్కించిన మరో డ్రైవర్
Advertisement

Chittoor Atrocious: చిత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ డ్రైవర్‌పై మరో డ్రైవర్ బస్సు ఎక్కించి చంపేశాడు. ఓ టోల్ గేట్ వద్ద జరిగిన ఘర్షణలో డ్రైవర్ పై మరో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్ గేట్ దగ్గర చిన్న గొడవతో డ్రైవర్ ను మరో డ్రైవర్ బస్సుతో ఢీకొట్టాడు.

మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాయి. రాత్రి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మహాసముద్రం టోల్ గేట్ దగ్గరకు రెండు బస్సులు ఒకేసారి రావడంతో ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగిలింది. ఈ కారణంగా రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుందిత.
ఈ క్రమంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్లగా.. మార్నింగ్ స్టార్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు.. సుధాకర్ రాజుపైకి బస్సును ఎక్కించి హతమార్చాడు. బస్సుతో సుధాకర్ రాజును ఢీకొట్టడమే కాకుండా మృతదేహాన్ని కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకు వెళ్లాడు. దీంతో మృతదేహం చిద్రమైంది.
ఈ ఘటనకు సంబంధించి తోటి డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×