
Nandyal news telugu(AP updates) : చోరీకి వెళ్లిన ఓ దొంగ తప్పించుకునే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నంద్యాలలోని సాయిబాలాజీ హాస్పిటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పాణ్యంలోని చెంచుకాలనీకి చెందిన అంజి.. సాయిబాలాజీ హాస్పిటల్ లో చోరికి ప్లాన్ చేశాడు.
అనుకున్నట్టే తెల్లవారుజామున చోరీ చేసేందుకు ఆసుపత్రి పైకి ఎక్కాడు. ఆసుపత్రిపైనే ఉన్న తన ఇంట్లో నుంచి డాక్టర్ బయటికి రావడంతో.. దొంగ భయపడిపోయాడు. తప్పించుకునే క్రమంలో 5వ ఫ్లోర్ కిటికీ పైకప్పుపై దాక్కున్నాడు.
కిటికీ పైనే ఇరుక్కుపోయాడు ఆ దొంగ. పైకి ఎక్కేందుకు వీలుకాక.. కిందకు దిగేందుకు ఆధారం లేకపోవడంతో.. ప్రాణభయంతో అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన డాక్టర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నిమాపక బృందం సాయంతో 6 గంటలు శ్రమించి దొంగను రక్షించి అదుపులోకి తీసుకున్నారు.
Kesineni Nani : ఆ పార్టీ నుంచి ఆఫర్.. టీడీపీ నేతలపై కేశినేని ఘాటు విమర్శలు ..