E-Paper
Advertisement

Woman Slaps MLA : ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే?

Woman Slaps MLA : ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎందుకంటే?
Advertisement
Woman Slaps MLA

Woman Slaps MLA : ప్రజా ప్రతినిధులు ఉన్నదే ప్రజల సమస్యలు తీర్చడానికి. తమ గోడు పట్టించుకుంటారనే కదా ఓటేసి వారిని ఎన్నుకునేది. అలాంటి నేతలు.. కష్ట సమయాల్లో ప్రజలవైపు చూడకపోతే ఎంత కోపం వస్తుంది. ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది కదా. హర్యానాలో ఓ లేడీ అలానే చేసింది. అంతా అయిపోయాక వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోతే.. తీరిగ్గా ఇప్పుడు ఎందుకు వచ్చావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, చెంపపై కొట్టింది. దీంతో చేసేదేం లేక ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి మెల్లగా వెనుతిరిగాడు.

Advertisement

భారీ వర్షాలతో హర్యానాలో ఘగ్గర్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటమునిగాయి. నాలుగు రోజుల పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు వారి వైపే చూడలేదు. తిరిగ్గా ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు జననాయక్‌ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌. ఇండ్లు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు.. తమను ఎవరూ పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వెళ్లడంతో అతడిని చుట్టముట్టారు. వారిలో ఓ మహిళ కోపంతో ఎమ్మెల్యే చెంపపై ఒక్కటేసింది. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ నిలదీసింది. ఆ మహిళ కోపానికి తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే.. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×