Nara Lokesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశం బుధవారం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. కార్పోటర్ కు తక్కువ ఎమ్మెల్యేకు ఎక్కువ అంటూ విమర్శించారు. ఈ విమర్శలపై లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్ మాట్లాడుతూ.. మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో జగన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క గుంతను కూడా పూడ్చలేదని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ చేసిన కామెంట్స్ ని లోకేష్ ప్రస్తావిస్తూ.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తమకు అధికారాలు లేవని లోకేష్ అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జగన్‌కు 11వ బ్లాక్ లో సీటు కేటాయించామని, జగన్ నేరుగా అసెంబ్లీకి రావచ్చు అంటూ లోకేష్ సూచించారు. ప్రతి సభ్యుడికి స్పీకర్ మైక్ ఇస్తున్నారని, జగన్ మీడియా సమావేశాలతో కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ లోకేష్ సూచించారు. రూల్స్ అతిక్రమించడం అలవాటుగా ఉన్న జగన్, రూల్స్ అతిక్రమించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడంలో తప్పేమీ లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేయని చరిత్ర ఉందని, తాము త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. బెంగళూరులో కూర్చొని ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జగన్ మాట్లాడుతున్నారని, ముందు అసెంబ్లీకి రావాలంటూ జగన్ కోరారు. అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే ఆ ప్రతిరూపం జగనని, అహంకారంతోనే ఒకరోజు అసెంబ్లీకి వస్తారు మళ్లీ రారు అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారని, ఆ నిర్ణయాన్ని జగన్ స్వాగతించలేక మొండిపట్టు పడుతున్నారన్నారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అందుకే పెట్టుబడులు రావడం లేదంటూ జగన్ చేసిన విమర్శలపై లోకేష్ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో ఎన్నో పెట్టుబడులను సాధించిందని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరాచకాల వల్లనే ఎన్నో పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్లాయన్నారు. మాజీ సీఎం జగన్ కు ఛాన్స్ ఉంటే సిబిఐ ని రద్దు చేస్తారు.. సిఐడి ని మూసేస్తారు అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Also Read: Sharmila on Jagan: కర్త, కర్మ, క్రియ జగన్.. అంతా నాశనం చేశారు.. షర్మిళ సంచలన కామెంట్స్
ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే, ఓడినా ఓటమి అనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని ఇప్పటికైనా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం లో అవినీతి జరగలేదా? అవినీతి జరగలేదని బిడ్డలపై ప్రమాణం చేయగలరా అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ ఛాలెంజ్ విసిరారు. ఆత్మలతో మాట్లాడే జగన్ ఆ అలవాటు మార్చుకోవాలని లోకేష్ సెటైర్ వేశారు. అయినా, ఈవీఎంలో నైనా కూటమికి ప్రజలు పట్టం కడతారని అదే ఎమ్మెల్సీ ఎన్నికలో ఋజువైందని లోకేష్ అన్నారు. మొత్తం మీద జగన్ పై ఓ రేంజ్ లో లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు.