Non Veg Food: నాన్-వెజ్ ప్రియులు రోజూ చికెన్ లేదా ఇతర మాంసంతో వండిన పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చాలా వరకు పెరిగింది. ఫిజ్జాలు, నాన్ వెజ్ బర్గర్లు తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మాంసంలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి , జింక్, మెగ్నీషియం, ఇనుము వంటి వివిధ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి పరిమిత పరిమాణంలో మాత్రమే అవసరం. కానీ కొంతమంది తరచుగా తమ ఆహారంలో మాంసం తినడానికి ఇష్టపడతారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం.
వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మాంసం తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, తొమ్మిది ఇతర వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం ఆహారంలో క్రమం తప్పకుండా మాంసం తీసుకోవడం వల్ల తొమ్మిది రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ వ్యాధులకు, మాంసానికి మధ్య ఉన్న సంబంధాన్ని UK పరిశోధకులు నమోదు చేశారు. వీరి పరిశోధన ప్రకారం క్రమం తప్పకుండా మాంసం తినేవారికి గుండె జబ్బులు, మధుమేహం, న్యుమోనియా, కొన్ని ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
శరీరాన్ని డిటాక్స్ చేయడం: నాన్ వెజ్ నుంచి తీసుకునే కొవ్వులు, టాక్సిన్లు, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తగ్గించుకుంటే, శరీరం డిటాక్స్ అవుతుంది. అంతే కాకుండా ఇది లివర్, కిడ్నీ వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
నాన్ వెజ్ ఎక్కువగా హై కొలెస్టరాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్లు కలిగి ఉంటుంది. తరచుగా నాన్ వెజ్ తింటే గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. 30 రోజుల పాటు నాన్ వెజ్ తినకపోతే గుండె జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గడం:
మాంసాహారంలోని కొవ్వులు , ప్రోటీన్ల ప్రభావం వల్ల బరువు పెరగడం సాధారణం. నాన్ వెజ్ తగ్గించటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వారు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. 30 రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది .
మానసిక శాంతి:
కొంత మంది వ్యక్తులు మాంసాహారం తినకుండా ఉన్నప్పుడు మానసికంగా సంతోషంగా ఉంటారట. అంతే కాకుండా నాన్ వెజ్ తగ్గించడం లేదా పూర్తిగా ఆహారం నుండి తొలగించడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చే అనుభవాలను కూడా అందిస్తుంది.
Also Read: ఇలా క్లీన్ చేస్తే.. టైల్స్‌పై ఉన్న మొండి మరకలు కూడా మాయం
పోషక పదార్థాలు:
30 రోజుల పాటు మాంసం తినకపోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే.. వీటి ప్లేస్‌లో మీరు వివిధ రకాల పోషక పదార్థాలను తింటారు. ఇలా చేయడం వల్ల మీరు మొక్కజొన్న, పప్పులు, కూరగాయలు వంటి ఫైబర్ , అనేక పోషకాలు గల ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది.
హార్మోన్ సమతుల్యత:
నాన్ వెజ్ తినడం వల్ల శరీరంలో హార్మోన్ అసమ తుల్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అసమ తుల్యత తగ్గించేందుకు నాన్ వెజ్ తినకుండా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది.