BigTV English

Mother: అమ్మకు ప్రేమతో.. ఎంతవారుగానీ..

Mother: అమ్మకు ప్రేమతో.. ఎంతవారుగానీ..
shoe lace

Mother: ఆదివారం మదర్స్ డే. చాలామంది అమ్మకు ప్రేమతో శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో సెల్ఫీలు, స్టేటస్‌లు పెట్టుకున్నారు. అమ్మ గొప్పతనం గురించి పోస్టులు పెట్టారు. సోమవారం నుంచి మళ్లీ మామూలే. అయితే, మదర్స్‌ డే మర్నాడే.. ఏపీలో ఓ ఆసక్తికర దృశ్యం ఆవిశృతమైంది.


నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సెంచరీ కొట్టింది. 100 రోజుల్లో 1268 కిలోమీటర్లు నడిచారు. అందుకు గుర్తుగా శ్రీశైలం నియోజకవర్గంలోని మోతుకూరులో పైలాన్‌ ఆవిష్కరించారు. పాదయాత్ర హండ్రెడ్ డేస్‌కు చేరుకున్న సందర్భంగా.. లోకేశ్‌తో పాటు అడుగులు వేశారు తల్లి భువనేశ్వరి. పలువురు నందమూరి కుటుంబసభ్యులు సైతం వారితో జతకలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా జరిగిందీ ఆసక్తికర ఘటన.

పాదయాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి షూ లేస్ ఊడిపోయింది. అది గమనించిన నారా లోకేశ్.. కింది కూర్చుని.. అమ్మ షూ లేసును కట్టారు. ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు అక్కడ ఉన్నవాళ్లంతా.


ఈ ఫోటో చూస్తుంటే.. ఇలాంటిదే మరో ఫోటో గుర్తుకొస్తుంది. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇలాంటి సంఘటనే జరిగింది. కొడుకు రాహుల్ గాంధీకి సంఘీభావంగా తల్లి సోనియాగాంధీ సైతం పాదయాత్రలో అడుగులేశారు. ఆ సమయంలో సోనియా షూ లేస్ ఊడిపోయింది. అప్పుడు రాహుల్ గాంధీ సైతం ఇలానే కింద కూర్చొని.. తల్లి వేసుకున్న షూ లేసు కట్టారు. ఆ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పుడు నారా లోకేశ్ ఫోటో సైతం సేమ్ టు సేమ్ అలానే ఉందంటూ కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు.

రాహుల్. గాంధీల వారసుడు. కాంగ్రెస్ యువరాజు. భవిష్యత్ ప్రధానిగా చూస్తారు ఆ పార్టీ కార్యకర్తలు. అంతటి నాయకుడు సైతం తల్లి చాటు బిడ్డే. తల్లి సోనియా అంటే ఎంత చనువో.. అంతకంటే ఎక్కువే గౌరవం. తల్లితో రాహుల్ గాంధీకి ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా అనేక ఫోటోలు కనిపిస్తుంటాయి. హగ్ చేసుకోవడం, గడ్డం పట్టుకొని సరదాగా మెదలడం, షూ లేస్ కట్టడం.. ఇలా చాలాచాలా సాక్షాలే ఉన్నాయి. దేశ్‌కి నేత అయిన రాహుల్ గాంధీ.. ఆ తల్లికి తగ్గ కొడుకే.

నారా లోకేశ్ కూడా అంతే అంటారు. అమ్మ భువనేశ్వరి అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. చంద్రబాబు సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండేవారు. ఇంటిపట్టున ఉండే సమయం తక్కువ. అందుకే, లోకేశ్ ఆలనాపాలనా అంతా భువనేశ్వరినే చూసుకునే వారు. చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. నారా లోకేశ్‌కు తండ్రి చంద్రబాబు కంటే.. తల్లి భువనేశ్వరితోనే చనువు, సాన్నిహిత్యం ఎక్కువ. వంద శాతం తల్లి చాటు బిడ్డ. అమ్మ అంటే లోకేశ్‌కు ఎంత అభిమానమో చెప్పడానికి ఈ ఫోటోనే బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు నారా లోకేశ్.. ఇద్దరు రాజకీయ ప్రముఖులు దాదాపు ఒకేలాంటి సందర్భంలో.. ఒకేలా వ్యవహరించడం.. తల్లిపై తమ ప్రేమను ఇలా చాటుకోవడం ఆసక్తికరం.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×