BigTV English
Advertisement

Nara Lokesh Speech: మన్యం శంఖారావం.. వైసీపీ నేతలను బ్యాటింగ్ ఆడిన లోకేశ్..

Nara Lokesh Speech: మన్యం శంఖారావం.. వైసీపీ నేతలను బ్యాటింగ్ ఆడిన లోకేశ్..
Nara Lokesh Speech

Nara Lokesh in Manyam Sankharavam Sabha(AP election updates): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం పేరిట చేపట్టిన ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మన్యం జిల్లాలో జరిగిన శంఖారావంలో వైసీపీ నేతలను లోకేశ్ బ్యాటింగ్ ఆడేశారు. వైసీపీ ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం పోరాడిందా ? అని ప్రశ్నించారు.


ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచుతానన్న సీఎం జగన్ తర్వాత ఏం చేశారని లోకేశ్ నిలదీశారు. వైసీపీ 22 మంది లోక్‌సభ సభ్యులు.. 9 మంది రాజ్యసభ సభ్యులున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారని అడిగారు. అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తున్నారని సెటైర్లు వేసారు. ‌ ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను, 16 మంది ఎంపీలను బదిలీ చేశారని విమర్శించారు. 90 శాతం మంది బీసీ, ఎస్సీ నాయకులే జగన్ మార్చేశారని ఆరోపించారు.

Read More: రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం.. వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం..!


జగన్ ఐపీఎల్ టీం పెడతారంటా అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. కోడికత్తి వారియర్స్ పేరు పెట్టుకోవాలని సూచించారు. వాళ్ల డ్రామా మర్చిపోలేదు కదా అని అన్నారు. వైసీపీ టీమ్ లో ఆల్ రౌండర్లు ఉన్నారని తెలిపారు. అవినాష్ రెడ్డి బాబాయ్ ను పొడిచి చంపాడు కదా అని ఆరోపించారు. బెట్టింగ్ స్టార్ అనిల్ కుమార్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాటర్ గోరంట్ల మాధవ్, రీల్స్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ అంటూ సెటైర్లు పేల్చారు. భూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, ఆల్ రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి అని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

లోకేశ్ ఎక్కడా తడబడకుండా సూటిగా వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీలోని వివాదస్పద నేతల పేర్లు ప్రస్తావించి వాళ్ల తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. యువగళం పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన లోకేశ్ ఇప్పుడు శంఖారావం పేరిట చేపట్టిన ప్రచారంలో అదే దూకుడుతో ముందుకెళుతున్నారు.

Related News

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Big Stories

×