BigTV English

Hornbills birds love story: ఈ వాలెంటైన్స్ డేకి అందమైన ప్రేమకథ.. మీ హృదయాన్ని కరిగించే హార్న్‌బిల్స్ పక్షుల ప్రేమ కథ

Hornbills birds love story: ఈ వాలెంటైన్స్ డేకి అందమైన ప్రేమకథ.. మీ హృదయాన్ని కరిగించే హార్న్‌బిల్స్ పక్షుల ప్రేమ కథ

beautiful love story of Hornbills birds: వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఎఫ్‌ఎస్‌ ట్విట్టర్‌లో రెండు హార్న్‌బిల్‌ పక్షి ‘అందమైన ప్రేమకథ’ని పంచుకుంది. ఈ పక్షులు తమ పిల్లలను ఎలా కలిసి పెంచుకుంటాయో మీకు తెలియకపోతే, తప్పకుండ ఈ కథ వినాల్సిందే. ఫోటోలో మగ పక్షి ఆహారాన్ని తన భాగస్వామికి ముక్కు సహాయంతో అందిస్తున్న దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. ఈ వాలెంటైన్స్‌ డేకి ఇంతకంటే అందమైన ప్రేమ కథ మరోకటి ఉంటుందా.


వాలెంటైన్స్‌ డే సందర్భంగ.. తాము ప్రేమించిన వ్యక్తి కోసం సోషల్‌ మీడియాలో వివిద రకల పోస్టులు పెటి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అలా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ హార్న్‌బిల్‌ పక్షి ‘అందమైన ప్రేమకథ’ను పంచుకున్నారు.

తాను షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోల్లో హార్న్‌బిల్‌ పక్షుల జంట తమ పిల్లలను పెంచుతున్నప్పుడు వాటి మధ్య ప్రయాణం, ప్రేమను వర్ణిస్తాయి. నిజంగానే ఈ పక్షుల ప్రేమ కథ విశేషమైనదే. ఈ పక్షులు ఒకదానితో మరోపటి బలమైన బంధం, నిబద్ధతకు నిదర్శనం. వాటి సంతానాన్ని పెంచే బాధ్యతలను పంచుకుంటాయి.


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ పక్షుల గురించి సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. భారతదేశంలో హార్న్‌బిల్స్‌ పక్షుల్లో 9 జాతులు ఉన్నట్లు తెలిపారు. ఈ పక్షులు సాధారణంగా ఏకస్వామ్యం కలిగి ఉంటాయి. ఈ జంట చాలా కాలం పాటు ఉంటుందని వివరించారు. ముందు జంట పక్షులు తమ ఇంటి కోసం చెట్టును ఎంచుకుంటాయి. ఆ తరువాత ఆడ పక్షి గుటిని నిర్మిస్తుంది. ఇప్పుడు మగ పక్షి అడవి చుట్టూ తిరిగి ఆహారం సేకరించి కుటుంబం కోసం తీసుకురావాలి అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×