BigTV English

AP Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం.. వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం..!

AP Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం.. వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం..!
YCP party latest news

Chandrababu Clarity on TDP Contest in Rajya Sabha Elections 2024(AP news live): ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఇక వైసీపీ అభ్యర్థుల విజయం లాంఛనమే కానుంది.


టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉండవల్లిలో తన నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తో భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే యోచన లేదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టతనిచ్చారు.

‘‘రా కదలి రా’’ సభలు, లోకేష్ ‘‘శంఖారావం’’ పై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. ఎన్నికలకు ఇక 56 రోజులే ఉందని నాయకులు పూర్తిగా యాక్టివ్ కావాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై పార్టీ నాయకులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీ కీలక నేతలు టచ్‌లోకి వచ్చిన మాట నిజమేనని క్లారిటీ ఇచ్చారు.


Read More: అయ్యోపాపం సుబ్బారెడ్డిని అపార్థం చేసుకున్నామా? ఉమ్మడి రాజధానిపై వైసీపీ యూటర్న్..

వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు పొత్తులు, కొత్తగా నేతల చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న నేతల రాజకీయ భవిష్యత్‌కు నష్టం జగరకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తొలు నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా కల్పించారు.

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్ ను కలిశారు. వారికి ముఖ్యమంత్రి బీ–ఫారాలు ఇచ్చారు. అనంతరం ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారు నామినేషన్ల సమర్పించారు. టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×