Visakha CII Summit: నా కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్నారు ఉపాసన. విశాఖ సీఐఐ సమిత్ కు రావడంతో ఆనందంగా ఉందని మనసులోని మాట చెప్పారు. రాక్‌స్టార్ మంత్రి లోకేశ్ 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావడం అద్భుతంగా ఉందన్న ఉపాసన, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ నుంచి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.
విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరుగుతున్న సీఐఐ సదస్సుకు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల హాజరయ్యారు. సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం యంగ్ ఆంధ్ర-థ్రైవింగ్ ఆంధ్ర ఈవెంట్ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను రాక్‌స్టార్ మంత్రిగా వర్ణించిన ఆమె, కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.
ఇద్దరి తాతలు ఏపీకి చెందిన వారేనని, ఒకరు ఆత్మగౌరవాన్ని, మరొకరు ఆత్మ విశ్వాసాన్ని మారుపేరుగా చెప్పారు. వాటిపై మన కుటుంబాలు సంస్థలను నిర్మించాయని, ఈ వారసత్వాన్ని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు ఉపాసన. దీనికి మంత్రి రిప్లై ఇచ్చారు. అమరావతిని రాజధానిగా చేసుకుని కొత్తగా ఏపీని ఆవిష్కరించాల్సి వస్తోందన్న మంత్రి, సంక్షోభంలో అవకాశాలుంటాయని తెలిపారు. ఆ దృక్పథంతో ముందుకు సాగుతున్నామన్నారు. మీ తాతయ్య ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమైతే, మీరంతా ఆ బ్రాండ్‌ను ఈ స్థాయికి తీసుకు వెళ్లిన తీరు చాలా ఆనందకరమన్నారు.
మహిళలకు నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాలు ఇస్తుంటే పిల్లలు పుట్టాక ఉద్యోగాలు మానేస్తున్నారని అన్నారు ఉపాసన. కొంతకాలానికి వారిలో నైపుణ్యాలు తగ్గి పోతున్నాయని అలాంటి వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి ఎలా తీసుకురావాలన్న ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. మహిళలు బ్లూ కాలర్ ఉద్యోగాలు ఎంచుకునేలా ప్రోత్సహించాలని చెప్పకనే చెప్పారు. పాదయాత్ర సమయంలో ఓ మహిళ కియా పరిశ్రమ వద్ద తనను కలిసి ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత కుటుంబాన్ని తానే పోషిస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇంటి పనులకు సంబంధించి ఒకటి-రెండు తరగతుల పుస్తకాలు చూశానని వివరించారు. అందులో ఫొటోలు అందరూ మహిళలే ఉన్నారన్నారు. వివాహం తర్వాత అమెరికాలో బ్రాహ్మణి-నేను ఇంటి పనులు చెరి సగం పంచుకున్నామని తెలిపారు. పాఠ్య పుస్తకాల్లో ఆ చిత్రాలు మార్పించామని, ఇంటి పనుల్లో పురుషులు-మహిళలు సగం సగం ఉండేలా మార్చామని తెలియజేశారు.
ALSO READ: అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నదిలో గల్లంతైన ఇద్దరు రైతులు
#CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP#InvestInAP
మహిళలు పెద్దఎత్తున ఉద్యోగ రంగంలోకి వచ్చేలా, బ్లూ కాలర్ ఉద్యోగాలను ఎంచుకునేలా ఒక నూతన విధానాన్ని సృష్టించాలి. ప్రైవేట్ రంగం కూడా మహిళలను మరింత చురుగ్గా ఉద్యోగాల్లోకి ఆహ్వానించాలి. పాఠశాల స్థాయిలోనే మూస పద్ధతులను… pic.twitter.com/SCKZvEQ6va— Telugu Desam Party (@JaiTDP) November 13, 2026
#CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP#InvestInAP
మనందరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అవగాహన లేకపోవడమే. చాలా మంది యువకులు అమెరికా వెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ విద్య, వైద్య రంగాలలో ఇప్పుడు ఇతర దేశాలు కూడా తలుపులు తెరుస్తున్నాయి. అందువల్ల, ఒకవైపు మన విద్యా వ్యవస్థను… pic.twitter.com/W9ztjMMNHQ— Telugu Desam Party (@JaiTDP) November 12, 2026