E-Paper
Advertisement

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!
Advertisement

Saffron Farming: మండుటెండలకు పెట్టింది పేరైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక జంట అద్భుతం సృష్టించింది. మట్టి లేకుండా కేవలం 400 చదరపు అడుగుల గదిలో కశ్మీర్ కుంకుమపువ్వును (Saffron) పండిస్తూ నెలకు రూ. 4 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. నాగ్‌పూర్ సమీపంలోని హింగ్నా ప్రాంతానికి చెందిన అక్షయ్ హోలే, దివ్య లోహకరే హోలే దంపతులు ఏరోపోనిక్స్ (Aeroponics) సాంకేతికతతో ఈ ఘనత సాధించారు. వీరి వ్యాపారం ఇప్పుడు ఏడాదికి రూ. 40 నుంచి 50 లక్షల టర్నోవర్‌కు చేరుకుంది. వీరు పండించే కుంకుమపువ్వు గ్రాము రూ. 630 చొప్పున.. అంటే కిలో రూ. 6.3 లక్షల వరకు అమ్ముడవుతోంది.

ఆలోచన పుట్టిందిలా..

బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన అక్షయ్, బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన దివ్య.. 2020లో కుంకుమపువ్వు సాగుపై దృష్టి సారించారు. దేశంలో కుంకుమపువ్వుకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటాన్ని వారు అవకాశంగా మలుచుకున్నారు. దీని సాగుకు సంబంధించిన మెలకువలు నేర్చుకోవడానికి రెండేళ్ల వ్యవధిలో దాదాపు మూడున్నర నెలల పాటు కశ్మీర్‌లో గడిపారు. అక్కడి అనుభవజ్ఞులైన రైతుల వద్ద శిక్షణ పొందారు.

ఆ దెబ్బతో ఆత్మవిశ్వాసం రెట్టింపు

Advertisement

తొలుత కేవలం కిలో బరువుండే 100 కుంకుమపువ్వు దుంపలతో (Corms) ప్రయోగం మొదలుపెట్టి.. కొద్ది గ్రాముల దిగుబడిని అక్షయ్, దివ్య జంట సాధించారు. ఆ అనుభవంతో 350 కిలోల దుంపలపై పెట్టుబడి పెట్టగా.. సుమారు 1,600 గ్రాముల కుంకుమపువ్వు దిగుబడి వచ్చింది. దీంతో వారిలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. కుంకుమ పువ్వు సాగు వ్యాపారాన్ని ఎలాగైనా విస్తరించాలని వారు నిర్ణయించుకున్నారు.

కశ్మీర్ వాతావరణం సృష్టించి..

సాధారణంగా కుంకుమపువ్వు కశ్మీర్ వంటి చల్లని ప్రాంతాల్లోనే పెరుగుతుంది. కానీ ఈ దంపతులు ఒక గదిలో కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. గదిలో ఉష్ణోగ్రత, తేమ, వెలుతురును నియంత్రిస్తూ.. మట్టికి బదులుగా ఏరోపోనిక్స్ పద్ధతిలో మొక్కల వేర్లకు తుంపరల (Misting) రూపంలో నీరు, పోషకాలను అందించారు. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి సౌరశక్తిని (Solar power) వినియోగించడంతో పాటు, పనులన్నీ వారే స్వయంగా చేసుకోవడం వల్ల నిర్వహణ ఖర్చులు చాలా వరకూ తగ్గాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పంట కోతకు వస్తుందని మిగిలిన నెలల్లో తదుపరి సీజన్ కోసం దుంపలను సంరక్షిస్తామని వారు తెలిపారు.

సాఫ్రాన్ బోర్డు నుంచి గుర్తింపు..

Advertisement

అక్షయ్, దివ్య జంట పండించిన కుంకుమపువ్వు నాణ్యతను ‘సాఫ్రాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కశ్మీర్’ సైతం గుర్తించడం విశేషం. ఈ వ్యాపారంలో దాదాపు 80 శాతం వరకు లాభాల మార్జిన్ ఉంటుందని అక్షయ్ చెబుతున్నారు. కేవలం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 10 లక్షలు ఖర్చవుతుందని.. దీని ద్వారా ఏటా రూ. 5 లక్షల విలువైన కుంకుమపువ్వు పండించవచ్చని ఆయన వివరించారు. ఇందులో వాడే యంత్రాలు 20 నుంచి 25 ఏళ్ల పాటు పనిచేస్తాయి కాబట్టి ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉపయోగపడుతుందని తెలియజేశారు.

తక్కువ కాలంలోనే పెట్టుబడి వెనక్కి..

తాము తొలుత రూ. 55 లక్షలు పెట్టుబడి కుంకుమ పువ్వు వ్యాపారంపై పెట్టినట్లు అక్షయ్, దివ్య జంట తెలిపారు. అయితే గడిచిన ఐదేళ్లలో రూ. 1.3 కోట్ల ఆదాయం సంపాదించామని తెలియజేశారు. ఇందులో ఎక్కువ భాగం గత రెండేళ్లలోనే వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మరోపైపు కుంకుమ పువ్వు సాగులో తాము నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తూ ఉపాధి మార్గాలను సైతం ఈ జంట చూపుతున్నారు. రూ. 15,000 ఫీజుతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు సుమారు 150 మందికి మెలకువలు నేర్పించారు.

Also Read: సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

గతేడాది 45 కేజీల ఉత్పత్తి..

అక్షయ్, దివ్య జంట వద్ద శిక్షణ పొందిన వారిలో 29 మంది మహారాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా కుంకుమపువ్వు సాగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం విశేషం. అంతేకాకుండా చిన్న రైతులపై మార్కెటింగ్ భారం పడకుండా వారి వద్ద నుంచి కుంకుమపువ్వును కొనుగోలు చేసి ప్యాకేజింగ్, మార్కెటింగ్ బాధ్యతలను కూడా అక్షయ్, దివ్యలే చూసుకుంటున్నారు. గతేడాది వీరి సొంత యూనిట్, భాగస్వామ్య రైతుల యూనిట్ల ద్వారా కలిపి మొత్తం 45 కిలోల కుంకుమపువ్వు ఉత్పత్తి కావడం విశేషం.

Also Read: అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

Tags

Related News

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన HR ఉద్యోగికి ప్రమోషన్.. కొన్ని నెలల తరువాత అతడికి భారీ షాక్

సామాన్యులకు షాక్.. వడ్డీ రేటు పెంచిన 5 బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే

ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!

65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!

Big Stories

Advertisement
×