Farmers Missing: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోవాడ గ్రామ సమీపంలో శారదా నదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దురు రైతులు గల్లంతయ్యారు. తుఫాన్ ప్రభావంతో ఎగసిపడుతున్న ఉధృత ప్రవాహంలో, ఊబిలో చిక్కుకుని శానాపతి అప్పారావు (55), ఎడువాక నూకరాజు(45) అనే స్థానిక రైతులు నదిలో కొట్టుకుపోయారు.
గాలింపు చర్యులు..
నిత్యం కష్టపడి పొలం పనులకు వెళ్లే అన్నదాతలు ఇలా ప్రాణాపాయంలో చిక్కుకోవడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్థానికుల సహాకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన రైతుల కోసం నదిలో రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ఘటన గోవాడ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలను నింపింది.
Also Read: మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య
నదిలో ఇద్దరు రైతులు గల్లంతు..
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామ సమీపంలోని శారదా నదిలో ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పొలం పనుల నిమిత్తం నది దాటుతుండగా, తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ఊబిలో చిక్కుకుని గోవాడకు చెందిన శానాపతి అప్పారావు (55),… pic.twitter.com/vgmJ7CiwOM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2026