E-Paper
Advertisement

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?
Advertisement

Denza D9 Luxury MPV: BYDకి చెందిన లగ్జరీ సబ్ బ్రాండ్ డెంజా (Denza) భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. D9, Z9 GT అనే రెండు లగ్జరీ కార్లను పరిచయం చేసింది. వీటిలో D9 ఒక ప్రీమియం లగ్జరీ MPV. ఇది MG M9, టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్, లెక్సస్ LM, మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.90 లక్షలుగా నిర్ణయించారు. అధికారిక డెంజా డీలర్‌షిప్‌లలో రూ.10 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

లగ్జరీ MPVలకు గట్టి పోటీ

భారత మార్కెట్లోకి వచ్చిన డెంజా D9.. MG M9, టయోటా వెల్‌ ఫైర్, కియా కార్నివాల్, లెక్సస్ LM, మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ లాంటి లగ్జరీ MPVలకు పోటీ ఇవ్వనుంది. విశాలమైన క్యాబిన్, ప్రీమియం సీటింగ్, అత్యాధునిక సాంకేతికత దీని ప్రత్యేకతలు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 730 కి.మీ రేంజ్

Advertisement

డెంజా D9ను 115kWh బ్యాటరీ ప్యాక్‌ తో తీసుకొచ్చారు. దీనికి అనుసంధానంగా పనిచేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 456bhp పవర్, 365Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ అందుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే NEDC సైకిల్ ప్రకారం 730 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ రేంజ్ కారణంగా లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడే వారికి D9 ఇంట్రెస్టింగ్ ఆప్షన్‌గా మారనుంది.

ప్రయాణాన్ని లగ్జరీగా మార్చే సూపర్ ఫీచర్లు

D9 ఇంటీరియర్‌ లో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా రెండో వరుసలో కెప్టెన్ సీట్లు స్పెషల్ అట్రాక్షన్. వీటికి 10వే పవర్ అడ్జస్ట్‌ మెంట్, హీటింగ్, వెంటిలేషన్, మెమరీ ఫంక్షన్లతో పాటు 10 పాయింట్ మసాజ్ సదుపాయం కూడా ఉంది. ఇక రెండో వరుస ప్రయాణికుల కోసం స్పెషల్ ఆర్మ్‌ రెస్ట్ స్క్రీన్లు, కూలింగ్, హీటింగ్ కంపార్ట్‌ మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. డ్యాష్‌ బోర్డ్‌ పై 15.6 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్, 10.25 అంగుళాల 3D ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. వీటితో పాటు 16-స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీల కెమెరా, ADAS టెక్నాలజీ, తొమ్మిది ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నాయి.

ఆకట్టుకునే డిజైన్.. 4 కలర్స్..

Advertisement

బయటి డిజైన్‌ లో పెద్ద క్రోమ్ గ్రిల్, స్పెషల్ లుక్ హెడ్‌ల్యాంప్‌లు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వెనుక వైపు LED లైట్ బార్‌ తో కూడిన టెయిల్‌ ల్యాంప్‌లు ఉన్నాయి. క్రోమ్ విండో లైన్, సిల్వర్ ఇన్‌సర్ట్‌ లు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. డెంజా D9 వేల్ సీ బ్లూ, కాస్మోస్ బ్లాక్, స్టార్రీ నైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఇంటీరియర్‌ లో బ్రౌన్, బీజ్, బ్లాక్ థీమ్‌ లను ఎంచుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా 6 సిటీల్లో డీలర్‌షిప్‌లు

D9, Z9 GT కార్లను గురుగ్రామ్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారా  కంపెనీ అమ్మనుంది. దీంతో భారత లగ్జరీ EV మార్కెట్లో డెంజా తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also: రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

Tags

Related News

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న BGauss.. ఏకంగా లక్ష యూనిట్ల సేల్ క్రాస్!

ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

చేతక్, ఏథర్‌కు పోటీగా వెస్పా ఈవీలు.. మూడు మోడళ్లలో ఏది బెస్ట్?

హీరోను దాటేసిన హోండా.. టూవీలర్ మార్కెట్లో బిగ్ ట్విస్ట్!

SUV అమ్మకాల్లో మహీంద్రా దూకుడు.. 10 నెలల్లోనే 6.15 లక్షలు దాటిన సేల్స్!

130 కి.మీ వేగం.. 320 కి.మీ ప్రయాణం.. దేశంలోనే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

Big Stories

Advertisement
×