BigTV English

KotamReddy: కోటంరెడ్డికి మేయర్ సపోర్ట్.. నెంబర్ గేమ్ స్టార్టెడ్..

KotamReddy: కోటంరెడ్డికి మేయర్ సపోర్ట్.. నెంబర్ గేమ్ స్టార్టెడ్..

KotamReddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రస్తుతం వైసీపీ రెబెల్ లీడర్. ఫోన్ ట్యాపింగ్ అంటూ జగన్ పై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసేదేలే అంటూ తేల్చేశారు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అధికారపార్టీ అటాక్ స్టార్ట్ అయిపోయింది. మంత్రులు, సలహాదారులు, రీజియన్ కోఆర్డినేటర్లు వరుసబెట్టి విమర్శల దాడి చేస్తున్నారు. కడప నుంచి ఓ జగన్ అభిమాని నేరుగా కోటంరెడ్డికే ఫోన్ చేసి.. అంతు చూస్తా అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఓ నెల్లూరు కార్పొరేటర్ ఏకంగా తొడగొట్టి.. బస్తీ మే సవాల్ అంటూ కోటంరెడ్డి ఫ్లెక్సీలు చింపేసి.. ఆయనపై పీఎస్ లో కిడ్నాప్ కేసు కూడా పెట్టాడు. ఇంతా జరుగుతున్నా.. కోటంరెడ్డి మాత్రం ఏమాత్రం అదరడం లేదు, బెదరడం లేదు. కిడ్నాప్ కేసు కాదు.. మర్డర్ కేసు పెట్టుకోండి.. ఎన్ కౌంటర్ చేస్కోండి అంటూ.. ధీటుగా జవాబిస్తున్నారు. ఇలా నెల్లూరు రూరల్ రచ్చ.. రంజుగా సాగుతోంది.


లేటెస్ట్ గా, ఎమ్మెల్యే కోటంరెడ్డి తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఓ కార్పొరేటర్ తనను కాదంటే ఏంటి.. ఏకంగా నెల్లూరు మేయరే తనకు సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టారు. కోటంరెడ్డితోనే ప్రయాణం.. ఆయనే మా ఊపిరి అంటూ నెల్లూరు మేయర్‌ స్రవంతి మీడియా ముఖంగా ప్రకటించారు. కోటంరెడ్డి ఎటు ఉంటే అటే.. ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు నెల్లూరు మేయర్.

తాను కార్పొరేటర్‌, మేయర్‌గా ఎదగడానికి కోటంరెడ్డే కారణమన్నారు మేయర్ స్రవంతి. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా అయినా చేస్తానని తేల్చి చెప్పారు. మేయర్ మాటలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించి పోయారు. ప్రెస్ మీట్ లో జరిగిన ఆ సీన్.. బాగా రక్తి కట్టింది.


ఇలా కోటంరెడ్డిని కార్నర్ చేసేలా.. ఆయన వెంట పార్టీ నేతలెవరూ లేరనేలా.. ఓ కార్పొరేటర్ తో వైసీపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తే.. అందుకు శ్రీధర్ రెడ్డి సైతం మేయర్ తో మద్దతు పలికించి.. తానేమీ తక్కువ కాదనేలా వైసీపీకి ధీటైన మెసేజ్ ఇచ్చారు. మరి, ఈ వర్గపోరులో నెల్లూరు రూరల్ నేతలు ఎటువైపు నిలుస్తారో..!!

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×