E-Paper
Advertisement

Amaravati News: ఫోన్లు చేసి బెదిరింపులా? తగ్గేది లేదన్న జగన్.. చేసి తీరితామన్న సీఎం చంద్రబాబు

Amaravati News:  ఫోన్లు చేసి బెదిరింపులా? తగ్గేది లేదన్న జగన్.. చేసి తీరితామన్న సీఎం చంద్రబాబు
Advertisement

Amaravati News: ఏపీలో అసలు ఏం జరుగుతోంది? మెడికల్ కాలేజీల పీపీపీ విధానం కొత్త వివాదాలకు దారి తీస్తోందా? దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? టెండర్లు వేయకుండా కంపెనీలను బెదిరిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? టెండర్ల విషయంలో అసలేం జరిగింది?

Advertisement

తారాస్థాయికి చేరిన మెడికల్ కాలేజీల పీపీపీ పద్దతిలో నిర్మాణం

Advertisement

ఏపీలో నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది చంద్రబాబు సర్కార్. దీనికి సంబంధించిన గడువు సోమవారంతో ముగిసిపోయింది. కేవలం ఒక్క కాలేజీకి పీపీపీ బిడ్ దాఖలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు కిమ్స్ ముందుకొచ్చింది.

మిగతా ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టేందుకు ఎలాంటి సంస్ధలు ముఖం చూపలేదు. ఈ విషయం తెలిసి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా షాకయ్యారు. జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఇలా జరిగిందని భావించారు. ఇటీవల తాము అధికారంలోకి రాగానే పీపీపీలను రద్దు చేసి వారిని జైలుకి పంపిస్తామని కుండబద్దలు కొట్టేశారు మాజీ సీఎం జగన్.

తగ్గేది లేదన్న జగన్.. చేసి తీరితామన్న సీఎం చంద్రబాబు

అంతేకాదు టెండర్లకు దాఖలు చేసే సంస్థలకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదని తేలింది. ఈ విషయం తెలియగానే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కూటమి సర్కార్ తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామంటున్నారు మంత్రి సత్యకుమార్. బెదిరింపుల వల్ల మెడికల్ కాలేజీలకు టెండర్లు రాలేదని అన్నారు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి టెండర్లను వేయవద్దని బెదిరించారని ఆరోపించారు. బెదిరించడం అనేది దేశ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదన్నారు.

ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే భావన కలుగుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా జగన్ వైఖరిలో ఏలాంటి మార్పు రాలేదన్నారు. ఏపీ భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే.. దాన్ని నాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం చేసినట్టుగానే ప్రతిపక్షంలోనూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ALSO READ: జీవీఎంసీ కార్పొరేటర్ల హైరానా..  అధికారులపై ఒత్తిడి 

ఈ విషయం తెలియగానే వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

బిడ్ వేసిన ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని వైద్య కళాశాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. మిగతా వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసేలా బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే కళాశాలల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా వైద్య కళాశాలల నిర్మాణం, వసతుల కల్పన వాటిపై కేంద్ర ప్రభుత్వ సూచనలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. వీజీఎఫ్‌ కింద అందించే 60 శాతం ఆర్థిక చేయూతను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం చొప్పున భరించాలని కేంద్రం సూచనలు చెబుతున్నాయని వివరించారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×