E-Paper
Advertisement

NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ.. అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు

NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ..  అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు
Advertisement

NTR District: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ వేళ రగడ మొదలైంది. కేక్ కటింగ్ విషయంలో యువకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత కర్రలతో ఫైటింగ్‌కు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?

న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య ఫైటింగ్

Advertisement

ఎన్టీఆర్ జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ యువకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. జగ్గయ్యపేట పరిధిలోని తొర్ర గుంటపాలెం ప్రాంతంలో కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు యువకులు కేక్‌ కట్టింగ్‌‌కు ప్లాన్ చేశారు. షాపు నుంచి కేక్ తీసుకొచ్చి మిడ్ నైట్ కేక్ కట్ చేశారు.

ఆనందంగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో అటువైపు కారులో నలుగురు యువకులు వచ్చారు. నడి రోడ్డుపై సంబరాలు ఏంటని పక్కన నిర్వహించుకోవాలని సూచన చేశారు. తమకు దారి ఇవ్వాలని వారిని కోరారు. కేక్‌ కట్టింగ్‌ తర్వాత కొందరు యువకులు కారు దగ్గరకు వెళ్లారు.

Advertisement

అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు

ఎట్టి పరిస్థితుల్లో తాము సెలబ్రేషన్స్ రోడ్డుపై చేస్తామని మొండికేశారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల యువకుల మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరినొకరు తోసేసుకుని ముఖాలపై పిడిగుద్దులు విసురుకున్నారు. ఆ తర్వాత కర్రలతో దాడులకు దిగారు. ఈ దాడిలో కారులో వచ్చిన ఓ యువకుడికి గాయాలు అయ్యాయి. మొత్తమ్మీద ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు.

అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గొడవ గురించి ఆరా తీశారు. గాయపడినవారిని స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. కోటికిపైగానే స్వాహా

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×