E-Paper
Advertisement

Psycho Thriller OTT : ఫుట్ పాత్ పై పడుకునే వాళ్ళే టార్గెట్… ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్… గ్రిప్పింగ్ నరేషన్

Psycho Thriller OTT : ఫుట్ పాత్ పై పడుకునే వాళ్ళే టార్గెట్… ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్… గ్రిప్పింగ్ నరేషన్
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ లో కోకొల్లలుగా ఉన్నాయి. అయినా కూడా ఇలాంటి సినిమాలకు క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ప్రతీ కథ కొత్తగానే ఉంటుంది. అసలు ఈ సైకోలు ఎందుకు సీరియల్ మర్డర్స్ చేస్తున్నారు ? అనే క్వశ్చన్ ప్రతీ సీరియల్ కిల్లర్ సినిమాలోనూ కథను చివరిదాకా నడిపిస్తుంది. అయినా కూడా ఏమాత్రం బోరు కొట్టదు స్టోరీ. మీరు కూడా ఈ జానర్ సినిమాల అభిమానులు అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (The Stoneman Murders) అనే హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 2009లో విడుదలైంది. దర్శకుడు మనీష్ గుప్తా 1980ల్లో ముంబైలో జరిగిన రియల్ స్టోన్‌మ్యాన్ సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా తెరకెక్కించారు. కేకే మీనన్ ఇందులో సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ షెలార్ అనే పాత్రను పోషించాడు. అయితే ఆయన సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ గా కన్పిస్తాడు. అర్బాజ్ ఖాన్ ఇన్‌స్పెక్టర్ కేదార్ ఫడ్కే గా, రుఖ్సార్ రెహ్మాన్ సంజయ్ భార్య మనాలిగా, విక్రమ్ గోఖలే AIG సతామ్ గా నటించారు. 1 గంట 35 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2009 ఫిబ్రవరి 13న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. IMDbలో 7.3 రేటింగ్ అందుకున్న ఈ మూవీ గ్రిప్పింగ్ నరేషన్ తో అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమాను చూడవచ్చు.

Advertisement

Read Also : సైకాలజిస్ట్ కి చావు రుచి చూపించే దెయ్యాలు… అత్తారింట్లోనూ వదలకుండా… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

కథ 1980ల కాలంలో ముంబైలో నడుస్తుంది. ఒక సీరియల్ కిల్లర్ రోడ్డు మీద నిద్రిస్తున్న హోమ్‌లెస్ పీపుల్ తలల్ని భారీ రాళ్లతో పగలగొట్టి చంపుతాడు. పేదలు, బిచ్చగాళ్లే టార్గెట్ గా వరుస హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ను “స్టోన్‌మ్యాన్” అని పిలుచుకుంటారు. ఒకేరకంగా 5 మర్డర్స్ జరిగినా కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసును సీరియస్ ‌గా తీసుకోదు. మరోవైపు సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ షెలార్ (కేకే మీనన్) ఒక కస్టడియల్ డెత్ కేసు వల్ల సస్పెండ్ అయ్యి ఉంటాడు. అందుకే ఇలా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్టోన్‌ మ్యాన్ కేసును సాల్వ్ చేస్,తే జాబ్ తిరిగి వచ్చే అవకాశం ఉందని ఫీల్ అవుతాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అతనికి సీనియర్ AIG సతామ్ (విక్రమ్ గోఖలే) డిపార్ట్మెంట్ కు తెలియకుండా సపోర్ట్ చేస్తాడు. సంజయ్ ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. రాత్రిపూట స్ట్రీట్స్ లో పెట్రోలింగ్ చేస్తాడు. ఇన్ఫార్మర్ ఘన్షూ హెల్ప్ తో సీరియల్ కిల్లర్ కు సంబంధించిన క్లూస్ ను కలెక్ట్ చేస్తాడు.

Advertisement

ఇంకోవైపు ఈ కేసు అధికారిక ఇన్వెస్టిగేటర్ ఇన్‌స్పెక్టర్ కేదార్ ఫడ్కే (అర్బాజ్ ఖాన్) సంజయ్ ‌ను అనుమానిస్తాడు. అంటే సంజయ్‌ ఇలా వరుస మర్డర్స్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఈ క్రమంలో మర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఇక అప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన సంజయ్ మిడ్‌ నైట్ క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ‌ను అనుమానిస్తాడు. 9 మంది చనిపోయాక గానీ పోలీసులు అసలు కిల్లర్ ను పట్టుకోలేకపోతారు. షాకింగ్ క్లైమాక్స్ తో మూవీ ముగుస్తుంది. ఇంతకీ కిల్లర్ ఎవరు ? ఎందుకు ఇంతమందిని చంపాడు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలయంటే మూవీపై ఒక లుక్కేయండి. అలాగే ఇదే స్టోరీతో వెబ్ సిరీస్ కూడా రూపొందింది. పనిలో పనిగా అది కూడా చూసేయండి.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×