BigTV English

Jagan : జగన్ పై దాడి కేసులో కుట్రకోణం లేదు.. తేల్చిన ఎన్ఐఏ..

Jagan : జగన్ పై దాడి కేసులో కుట్రకోణం లేదు.. తేల్చిన ఎన్ఐఏ..

CM Jagan News (AP Politics) : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేల్చింది. ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం ఈ దాడిలో లేదని నిర్ధారించింది. అప్పట్లో శ్రీనివాసరావు పనిచేసిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్‌ ప్రసాద్‌ తనను చంపేందుకు పన్నిన కుట్రలో భాగస్వామి అని జగన్‌ చేసిన అభియోగం అవాస్తవమని తేల్చింది. దాడిలో అతని పాత్ర, ప్రమేయం లేవని నిర్ధారించింది. దాడికి కొన్నిరోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పని చేయట్లేదంటూ జగన్‌ చేసిన మరో అభియోగం నిజంకాదని చెప్పింది. అన్ని సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని వెల్లడించింది.


కుట్ర కోణం వెలికితీసేలా మరింత దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఐఏకు ఆదేశాలివ్వాలని జగన్‌ ఇటీవల ఎన్‌ఐఏ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టులో ఈ కేసు విచారణ ఇప్పటికే ప్రారంభమైనందున తదుపరి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని, జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని ఎన్‌ఐఏ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది.

జగన్‌పై దాడిలో కుట్ర ఏమైనా ఉందా.. అన్న అంశం సహా అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేశామని స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు నుంచి కేసు రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించామని తెలిపింది. నిందితుడు, అతనితో పనిచేసిన వారి మొబైల్‌ ఫోన్లలోని డేటాను వెలికితీశామని చెప్పింది. ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేయించామని వెల్లడించింది. విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీల్లోని దృశ్యాలు విశ్లేషించామని వివరించింది. కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారైన సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సాక్ష్యాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది.


Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×