Nimmagadda Ramesh : ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించడం అనైతికమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి, మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సభ్యులతో కలిసి నిమ్మగడ్డ రమేశ్ గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.
ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించడం అనైతికమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి, మాజీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సభ్యులతో కలిసి నిమ్మగడ్డ రమేశ్ గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ప్రభుత్వం వేరు.. అధికార పార్టీ వేరు, రెండూ సమాంతర వ్యవస్థలు, అలాంటిది పార్టీ ప్రభావం ప్రభుత్వంపై పడకూడదు. ప్రభుత్వ వనరులు వినియోగిస్తూ, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం. ఇలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7 ద్వారా ఒక కార్యక్రమం ‘పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్’ పెట్టి ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నారు.
ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగమే. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఉండడంతో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. అందుకే గవర్నర్ గారిని కలిసి రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం. పాలనలో పారదర్శకత ఉండాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తోంది’’ అని చెప్పారు.