E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
MLA Malladi Vishnu :  వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .. నిన్న మొన్నటివరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకి షాక్ ఇచ్చారు జగన్.. మార్పులు చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు .. దాంతో మల్లాది విష్ణు అలకపాన్పు ఎక్కారు .. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి ..బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంట.. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు.

Municipal Employees Strike : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన  మున్సిపల్ కార్మికులు..
Allagadda TDP Politics | ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో టిడిపి టికెట్ ఎవరికి?
Sankranti : పందెంకోడితో పండగ సందడి..!
Ambati Rayudu to Join In Janasena : అంబటి ట్విస్ట్.. జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్..?

Ambati Rayudu to Join In Janasena : అంబటి ట్విస్ట్.. జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్..?

Ambati Rayudu to Join In Janasena : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఏమో? కాని.. ఆయనిస్తున్న పొలిటికల్ ట్విస్ట్‌లు మాత్రం తెగ పాపులర్ అవుతున్నాయి.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్ ప్రారంభించిన రాయుడు.. వైసీపీ చేరీ చేరగానే.. రిటైర్డ్ మెంట్ ప్రకటించి బయటకొచ్చేశారు. అలా అక్కడ ఇన్నింగ్ ముగించినప్పుడు.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.. అది జరిగి రోజులు గడవకుండానే లేటెస్ట్‌గా జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.. దాంతో ఆయన జనసేన టీంలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..
YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

Advertisement YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. విరూపాక్షికు సపోర్ట్‌ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. […]

Kesineni nani : అటు సీఎం జగన్ తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ.. ఇటు ఎంపీ పదవికి రాజీనామా..
Election Commissioner : ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు.. 22న తుది జాబితా విడుదల..
Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!
APPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్‌-2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు..
Chandrababu : ప్రజలను పేదరికంలోకి నెట్టి.. దేశంలో అత్యంత ధనికుడిగా ఎదిగి.. జగన్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu : ప్రజలను పేదరికంలోకి నెట్టి.. దేశంలో అత్యంత ధనికుడిగా ఎదిగి.. జగన్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu : రాష్ట్రంలో ప్రజలను పేదరికంలోకి నెట్టి జగన్ మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన ప్రశంగించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండగ సమయంలో ప్రజలకు ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్‌లను తీసుకొచ్చి రూ.5 రూపాయలకే పేదల కడుపు నింపామని చెప్పారు.

AP High Court : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌..

Big Stories

×