BigTV English

Ambati Rayudu to Join In Janasena : అంబటి ట్విస్ట్.. జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్..?

Ambati Rayudu to Join In Janasena : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఏమో? కాని.. ఆయనిస్తున్న పొలిటికల్ ట్విస్ట్‌లు మాత్రం తెగ పాపులర్ అవుతున్నాయి.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్ ప్రారంభించిన రాయుడు.. వైసీపీ చేరీ చేరగానే.. రిటైర్డ్ మెంట్ ప్రకటించి బయటకొచ్చేశారు. అలా అక్కడ ఇన్నింగ్ ముగించినప్పుడు.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.. అది జరిగి రోజులు గడవకుండానే లేటెస్ట్‌గా జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.. దాంతో ఆయన జనసేన టీంలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన పది రోజుల్లోపే .. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ట్విస్ట్ ఇచ్చారు.. గత నెలాఖరులో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం లాభిస్తుందని వైసీపీ కూడా భావించింది. అలాంటిది పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే అంబటిరాయుడు రిటైర్డ్ హర్ట్ ప్రకటించి వైసీపీ టీంలో నుంచి బయటకు వచ్చేశారు.

గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్న రాయుడు.. వివిధ సందర్భాల్లో జగన్‌ పాలనని ఆకాశానికెత్తేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అంతలోనే ఏమైందో ఏమో కాని.. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటూ ట్వీట్ పెట్టి వైసీపీకి రిజైన్ చేశేసారు.

కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానన్ని ప్రకటించిన అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.. దాంతో కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు సామాజికవర్గ లెక్కలతో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేయాలని అంబటి రాయుడు భావించినప్పుడు.. టికెట్‌పై వైసీపీ క్లారిటీ ఇవ్వలేదు.. సరిగ్గా రాయుడు వైసీపీలో చేరిన కొన్ని రోజులకే.. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయుల్ని.. గుంటూరు షిఫ్ట్ అవ్వమని పూరమాచించారు జగన్.. కృష్ణదేవరాయులు దానికి సిద్దంగా లేకపోయినా.. తనకు మాత్రం గుంటూరు టికెట్ దక్కదని భావించారో ఏమో? రాయుడు ఆ పార్టీని వదిలేశారు.

ఇక తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడంతో .. అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ప్రిపేర్ అయినట్లు కనిపిస్తోంది.. మరి జనసేనలో చేరితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.. తన సొంత నియోజకర్గమైన పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన జనసేన టికెట్‌పై పోటీ చేసే అవకాశమే లేదు .. పొన్నూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ లీడర్ ధూళిపాళ్ల నరేంద్ర నియోజకవర్గం.. ఆయన్ని కాదని ఆ సెగ్మెంట్ సర్దుబాటులో జనసేన ఖాతాలోకి రావడం అసాధ్యమే.

ఇక అంబటి రాయుడు ఆసక్తిగా ఉన్న మరో స్థానం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం.. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు.. దాంతో టీడీపీలోనే దిగ్గజ నేతలు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు… ఇలాంటి పరిస్థితుల్లో జనసేనలో చేరితే అంబటి రాయుడు ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×