BigTV English

Kesineni nani : అటు సీఎం జగన్ తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ.. ఇటు ఎంపీ పదవికి రాజీనామా..

Kesineni nani : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని సమావేశం అయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి కేశినేని నాని వెళ్ళారు . సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఆమె కుమార్తె శ్వేత , విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు.

Kesineni nani : అటు సీఎం జగన్ తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ.. ఇటు ఎంపీ పదవికి రాజీనామా..

Kesineni nani : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి కేశినేని నాని వెళ్లారు . సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఆమె కుమార్తె శ్వేత , విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు.


టీడీపీ‌కి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రకటించారు. ఆయన కుమార్తె శ్వేత టీడీపీ పార్టీ‌కి తాజాగానే రాజీనామా చేశారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. మరోవైపు సీఎం జగన్‌తో కేశినేని నాని భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆయన, కుమార్తెతో కలిసి వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ తో భేటీ కావడంతో ఆ వైసీపీ కండువాకప్పుకోవడంపై క్లారిటీ వచ్చేసింది. కేశినేని నాని గురువారం వైసీపీలో చేరే అవకాశం ఉంది.

టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని ఎంపీ కేశినేని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత వ్యాపారాలను పక్కన పెట్టి పార్టీ కోసమే పని చేశానన్నారు. టీడీపీ కోసం తనకు ఉన్న ఆస్తులు అమ్ముకున్నానని ,వ్యాపారాలు వదులుకున్నానన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి తనపై అనవసరమైన ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదన్నారు. సొంత పార్టీ నేతలే తనను తిట్టినా వారిపై చర్యలు తీసుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిమాటలన్నా పార్టీ కనీస మద్దతు ఇవ్వలేదన్నారు.


టీడీపీ కోసం డబ్బు , సమయం వృథా చేసుకోవద్దని చాలా మంది చెప్పారని కేశినేని నాని తెలిపారు. చంద్రబాబు మోసగాడని ప్రజల అందరికి తెలుసన్నారు. ప్రజలు, పార్టీ కోసం నిరంతం కష్టపడ్డానని తెలిపారు. చాలాసార్లు పార్టీ నుంచి వెళ్లిపోదాం అనుకున్నానని కేవలం చంద్రబాబు నాయుడు అడగడంతోనే పార్టీలో కొనసాగినట్టు తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమంలో ఎంపీగా అటెండ్ అవ్వాలి అది ప్రోటోకాల్ లో ఒక భాగం అని తెలిపారు. టీడీపీ తన విషయంలో ప్రోటోకాల్ మర్చిపోయిందని విమర్శించారు. సీఎం జగన్ కార్యక్రమాలకు చంద్రబాబు తనను హాజరవ్వకుండా చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి అని విమర్శించారు.

లోకేష్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. తన కుటుంబం సభ్యులతో తననే కొట్టించాలని ఎందుకు కుట్ర చేశారని ప్రశ్నించారు?. టీడీపీకి , ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించానని కేశినేని నాని తెలిపారు. తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరతానని ప్రకటించారు. టీడీపీ పార్టీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం రూ.100 కోట్ల రూపాయలను విజయవాడ కోసం కేటాయించారా? అని కేశినేని ప్రశ్నించారు.

తాను బాబును ఎప్పుడూ టికెట్ అడగలేదన్నారు. ఇప్పుడు కూడా సీఎం జగన్‌ను టికెట్ అడగనన్నారు. కేవలం సీఎం జగన్ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. త్వరలో టీడీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం ఖాళీ అవబోతుందన్నారు.

అటు లోక్‌సభ సభ్యత్వానికి ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే టీడీపీకి కూడా రాజీనామా చేసి, వైసీపీలో చేరబోతున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×