E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!
Advertisement

రైతు రాజ‌కీయం షురూ చేసింది బీఆరెస్‌. కేటీఆర్ దీన్నే ప్ర‌ధాన అస్త్రంగా తీసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో పాండురంగ అనే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం రైతుబీమాను ఈ స‌ర్కార్ ప‌ట్టించుకోలేద‌నే అంశం.. చ‌ర్చ‌కు తెర లేపింది. ఇదొక్క‌టే కాదు.. చాలా విష‌య‌లు రైతుల గురించి మాట్లాడాడు కేటీఆర్‌. చాలా వ‌ర‌కు వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గానే ఉన్నాయి. రైతులు కోపంగానే ఉన్నారు స‌ర్కార్ మీద‌. కానీ కేటీఆర్‌కు ఈ డోసు స‌రిపోలేదు. ఇంకా ఇంకా స‌ర్కార్‌ను రైతు కేంద్రంగా బ‌ద్నాం చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టున్నాడు.

రేవంత్ గ‌తంలో త‌మ మీద తీసుకున్న ప్ర‌తీకారానికి ఇది బ‌దులుగా అనుకోవాలేమో. వ‌రి పండిస్తే ఉరేన‌న్న కేసీఆర్‌.. త‌న ఫామ్‌హౌజ్‌లో ఇదిగో.. ఎంత‌లా వ‌రి పండించాడో చూశారా? అని రేవంత్ ఆ ఫోటోలు బ‌య‌ట‌పెట్ట‌డం బీఆరెస్‌ను బాగా డ్యామేజీ చేశాయి. ఎంత‌లా అంటే.. కేసీఆర్ రైతు వ్య‌తిరేకి అనేంత‌లా. వాస్త‌వానికి కేసీఆర్ అన్న‌ది ఆ ఉద్దేశ్యంతో కాదు. పెరిగిన వ‌రి విస్తీర్ణం.. ధాన్యం కొనుగోలు ఏటికేడాది స‌ర్కార్‌కు గుదిబండ‌గా మారుతోంద‌ని, కేంద్రం మొత్తం ధాన్యం కొన‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు.

Advertisement

వ‌రి క‌న్నా దిగుబ‌డి బాగా వ‌చ్చి మార్కెట్ డిమాండ్‌ను అనుస‌రించి మంచి గిట్టుబాటు ధ‌ర ఉంటే పంటలు కూడా సాగు చేయాల‌ని ఆయ‌న చెప్పిన విధానం ఇలా బూమ‌రాంగైంది. దీన్ని అందిపుచ్చుకున్నాడు ఆనాడు రేవంతు. ఇప్పుడు ఇదే టాపిక్‌తో రాజ‌కీయంగా రేవంతు అంతు చూసేందుకు డిసైడ్ అయ్యాడు కేటీఆర్‌.

మొన్న జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అస‌లు పంట‌ల‌ను కొనుగోలే చేయొద్ద‌ని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యాడ‌ట‌. దీన్ని మంత్రి వ‌ర్గం ఆమోదించిందంట కూడా. కేంద్రం కొనుగోలు చేయ‌డం లేదు కాబ‌ట్టి… ఏ పంట‌ల‌ను కేంద్రం ఎంత మేర కొనుగోలు చేస్తుందో… అంతే కొని.. మిగిలింది రైతులే అమ్ముకోవాల‌నే నిబంధ‌న పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌.ఈ ర‌హ‌స్యాన్ని రివీల్ చేశాడు కేటీఆర్‌. ఇది ప‌చ్చి అబ‌ద్దం.

Advertisement

పంటలు కొన‌క‌పోతే ఆ స‌ర్కార్‌కు మూడిన‌ట్టే. అది ఏ స‌ర్కారైనా. కేసీఆర్ భాష‌లో చెప్పాలంటే.. మెడ‌కాయ మీద త‌ల‌కాయ ఉన్నోడెవ‌డూ…. ఈ నిర్ణ‌యం తీసుకోడు. ఇత‌ర పంట‌ల మాటేమోగానీ.. ప్ర‌ధానంగా సాగ‌య్యే వ‌రి విష‌యంలో మాత్రం .. ఇప్పుడు ఈ రెండు పార్టీలు.. ఇక వ‌రి వ‌ద్దు.. మేము కొనం.. ఇంతే పండించండి.. ఆపై మీ ఇష్టం.. ! లాంటి మాట‌లు మాట్లాడ‌లేవు.

మాట్లాడే సాహ‌సం కూడా చేయ‌వు. అంత‌లా ఇది తీవ్ర‌మైన స‌మ‌స్య‌. స‌ర్కార్‌ల గ‌ద్దెల‌నే క‌ద‌లించే రైతుకు స‌బంధించిన సున్నిత‌మైన‌ అంశం. మ‌రి కేటీఆర్ గుడ్డిగా ఈ మాటెందుక‌న్నాడు..? బ‌ట్ట కాల్చి మీదేసేందుకే! ఇంకా ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ మ‌రీ ఇంత‌లా అబ‌ద్దాలా? అంటే అవును.. ఇది రేవంత్ నేర్పిన పాఠ‌మే క‌దా..! అత‌నికే ఇలా అదును చూసి అప్ప‌గిస్తున్నాం.. అనే స‌మాధాన‌మే వ‌స్తోంది వారి నుంచి.

Related News

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..!? హ‌రీశ్ నిన్నే…!

బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

Big Stories

×