BigTV English

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాన్ని పంచాయతీ కార్మికులు ముట్టడించారు. 8 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు. జగనన్న పుట్టిన రోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయటం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు.


పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ ఆఫీసు ముందు బైఠాయించి కదిలేదే లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికైనా స్పందించి.. తమకు జీతాలు ఇప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

జీతాలు చెల్లించకపోవడంతో.. కార్మికులు పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. దాంతో గ్రామంలో చెత్తా చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త ఇలానే పేరుకుపోయి ఉంటే.. అంటువ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×