E-Paper
Advertisement

Megastar Tweet : సలార్ మెగా సక్సెస్ పై మెగాస్టార్ ట్వీట్ ..

Megastar Tweet : సలార్ మెగా సక్సెస్ పై మెగాస్టార్ ట్వీట్ ..
Advertisement

Megastar Tweet : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కెరియర్ లో ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్లాపులు వెంటాడాయి. సాహో ,రాదే శ్యామ్ ,ఆది పురుష్ ఇలా ఫెయిల్యూర్లలో హ్యాట్రిక్ సాధించిన ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో అనుమానాలు కూడా అదే రేంజ్ లో వ్యక్తం అయ్యాయి.. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన సలార్ మూవీ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా మంచి పాజిటివ్ బస్ నెలకొల్పింది. ఇక ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్ సృష్టించిన సునామీ గురించే చర్చలు వినిపిస్తున్నాయి. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సలార్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రీమియర్ తోటే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ కు మంచి బూస్ట్ ఇస్తోంది. గత కొద్ది కాలంగా డార్లింగ్ నుంచి మంచి సాలిడ్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అందరూ ఈ మూవీ సక్సెస్ చూసి ఆనందిస్తున్నారు.

Advertisement

ఆదిపురుష్ వంటి ఫ్లాప్ తర్వాత ప్రభాస్ నుంచి ఈ రేంజ్ హిట్ రావడం నిజంగానే డార్లింగ్ ఫ్యాన్స్ కి ఆనందం కలిగించే విషయం. ఇక ఏ మూవీకి ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. భారీ కటౌట్ ల దగ్గర నుంచి సినిమా హాల్ ముందు డీజే మోగించడం వరకు వినూత్నమైన స్టైల్ లో ప్రభాస్ సక్సెస్ ను అతని అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం ప్రభాస్కు తమదైన శైలిలో అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సలార్ చిత్రం గురించి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం మెగాస్టార్ ఇచ్చిన మెగా రివ్యూ నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ చిరంజీవి పోస్టులో ఏమి రాశారంటే.. ‘డియర్ దేవా..సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. ఈ మూవీ సక్సెస్ కు ముందుగా హీరో ప్రభాస్ కు శుభాకాంక్షలు. డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ నిర్మించిన ప్రపంచం కుడోస్..’అని చిరంజీవి తనదైన స్టైల్ లో మూవీ సక్సెస్ పై స్పందించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×