E-Paper
Advertisement

Cyberabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.. సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి వెల్లడి..

Cyberabad: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ తెలిపారు. శనివారం సైబరాబాద్‌ వార్షిక నేర నివేదికను సీపీ విడుదల చేశారు.

కమిషనరేట్‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరిగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్‌ సిబ్బంది 2 నెలలు సమర్థంగా పని చేశారని సీపీ తెలిపారు. గత సంవత్సరం సైబర్ క్రైమ్‌లు కేసులు 4,850 కేసులు ఉంటే.. ఈ సంవత్సరంలో 5,342 కేసులు నమోదయ్యాయని సీపీ అవినాష్ మహంతి తెలియజేశారు. రూ.232 కోట్ల నగదు మోసం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ కేసులు ఈ ఏడాది 277 కేసులు నమోదు కాగా.. 567 మందిని అరెస్టు చేశామని తెలిపారు. రెండు పీడీ యాక్టులు నమోదు చేసి, రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా సైబరాబాద్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఏడాది మహిళపై నేరాలు పెరిగాయని, అయితే అత్యాచారం కేసులు తగ్గాయన్నారు. 2022లో 316 అత్యాచారం కేసులు , ఈ ఏడాది 259 కేసులు నమోదు అయినట్లు ఆయన తెలియజేశారు.

గత సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దోపిడీ, చోరీ కేసులు పెరిగాయని అవినాష్ మహంతి తెలిపారు . ఈ ఏడాది 52,124 డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే.. వాటిలో 1,271 మందికి శిక్షలు పడ్డాయని తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. సిఫార్సు లేఖలుపై పొస్టింగ్‌లు ఉండవని, ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్‌ మహంతి హెచ్చరించారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×