Lorry On railway track : గుంతకల్లులో శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం తప్పింది. శరవేగంగా దూసుకువస్తున్న వందే భారత్ రైల్వే ట్రాకుపై.. లారీ, ప్రయాణికులతో నిండిన బస్సు ఆగిపోవడంతో భయాందోళనకర వాతావరణం నెలకొంది. లారీ ఎంత సేపటికీ కదలకపోవడం, బస్సు సైతం వెనుక్కి, ముందుకు వెళ్లలేని స్థితిలో రెండు భారీ వాహనాల్ని రైలు ఢీ కొట్టే పరిస్థితి నెలకొంది.
గుంతకల్లులో రైల్వే క్రాసింగ్ దగ్గర అనుకోని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. రైల్వే ట్రాక్ దాటుతు.. ఓ లారీ పట్టాలకు అడ్డంగా ఆగిపోయింది. లారీ ముందుకు, వెనక్కు కదలకపోవడంతో దాని వెనుక వచ్చిన అన్ని వాహనాలు చిక్కుకుపోయాయి. ముందు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వెనుక వాహనాలన్నీ దగ్గరగా గుమ్మిగూడగా.. నిండుగా ప్రయాణికులున్న ఆర్టీసీ బస్సు సైతం అందులో చిక్కుకుపోయింది. కొన్ని నిముషాల్లోనే అటువైపుగా వందే భారత్ రైలు దూసుకు వచ్చింది.
బస్సు ఆగిపోయిన కొద్దిసేపటికే పట్టాలపై కూత పెట్టుకుంటా వందే భారత్ రైలు వేగంగా దూసుకు వచ్చింది. దూరం నుంచి రైలు రాకను గమనించిన బస్సులోని ప్రయాణికులు ప్రాణాల్ని చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. చిన్నా,పెద్దా, ముసలి అంతా బస్సు దిగి రైలు పట్టాలు దాటుకుంటూ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు అక్కుడున్న వారిలో భయాందోళనలను కలిగించాయి. ఏం జరుగుతుందో చాలా సేపటి తర్వాత అర్థం అవ్వడంతో.. వెనుక నిలిపి ఉంచిన వాహనదారులు అప్రమత్తమయ్యారు. కానీ.. అప్పటికే రైలు చాలా దగ్గరకు వచ్చేసింది.
రైలు పట్టాలపై అడ్డంగా ఆగిన లారీ, బస్సును గమనించిన వందే భారత్ లోకో ఫైలట్.. ఎన్నిసార్లు హెచ్చరికగా హారన్ మోగించినా స్పందన లేకపోవడంతో ప్రమాదన్ని గుర్తించారు. దాంతో.. రైలును దూరంగా ఆపేశారు. రైలు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రతికిపోయామంటూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత లారీని పట్టాలపై నుంచి ప్రయాణికులు ముందుకు నెట్టడంతో లారీ పట్టాలపై నుంచి అడ్డుతొలగింది. ఆ తర్వాత బస్సు సైతం అక్కడి నుంచి ముందుకు కదిలింది.
Also Read : కంటతడి పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత.. ఇటీవల పరిణామాల విషయంలో తీవ్ర ఆవేదన..
రైల్వే పట్టాలపై లారీ, ప్రయాణికుల బస్సు ఆగిన ఘటనతో ఆ పరిసరాల్లో ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాస్త ఉంటే ఎంత మంది ప్రాణాలు కోల్పోయో వాళ్లమోనని కంగారుగా చెబుతున్నారు.