Ind vs Eng 2nd T20I: టీమిండియా (Team India ) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ ( England ) వర్సెస్ టీమ్ ఇండియా మధ్య…. ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ చెన్నై వేదికగా జరిగిన రెండవ టి20 మ్యాచ్లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట్లో ఈజీగా గెలుస్తామని భావించిన టీమిండియా… చివరికి పోరాడాల్సి వచ్చింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma )… అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా.
Also Read: Ind vs Eng T20: టీమిండియా కు బిగ్ షాక్… రింకూ, నితీష్ ఇద్దరూ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్??
చెన్నై మ్యాచ్ విజయంతో టీమిండియా… 2-0 తేడాతో లీడింగ్ సంపాదించింది. ఇక మొదటి టి20 లో ఓడిపోయిన ఇంగ్లాండ్ క్రికెటర్లు… రెండవ టి20 లో పోరాడి ఓడిపోయారు. ఈ రెండవ టి20 మ్యాచ్ లో… మరోసారి టాస్ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు… బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ ప్లేయర్లు… చాలా కష్టపడి 165 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది ఇంగ్లాండు జట్టు. మరోసారి ఇంగ్లాండు కెప్టెన్ జోస్ బట్లర్ ( Jos Buttler ) .. తన ఎక్స్పీరియన్స్ తో రాణించాడు.
ఈ నేపథ్యంలోనే 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు బట్లర్. ఇందులో మూడు సిక్సర్లు అలాగే రెండు ఫోర్లు కూడా ఉన్నాయి. ఇతనితో పాటు మరో కుర్రాడు కార్సే… చివర్లో మెరుపులు మెరిపించాడు. 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి కాస్త టీం ఇండియాను కంగారు పెట్టాడు. కానీ.. చివరికి రన్ అవుట్ అయ్యాడు. ఇక టీమిండియా బౌలర్లలో… హర్షదీప్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.
Also Read: Ind vs Eng 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా…రింకూతో పాటు మరో ముగ్గురు దూరం !
ఇక టీమిండియా మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు అలాగే వరుణ్ చక్రవర్తి మరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా కాస్త తడబడింది. అయినప్పటికీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma ) 55 బంతుల్లో 72 పరుగులు చేసి దుమ్ములేపాడు. చివరి వరకు బ్యాటింగ్ చేసి… ఇండియాకు రెండవ విజయాన్ని అందించాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma ).
ఇందులో ఐదు సిక్సర్లు అలాగే నాలుగు ఫోర్స్ కూడా ఉన్నాయి. టీమిండియా ప్లేయర్లలో సంజు ఐదు పరుగులు చేయగా అభిషేక్ శర్మ 12 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా 12 పరుగులకు అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేసి దుమ్ము లేపాడు. కానీ చివరకు రవి బిస్నోయి అలాగే తిలక్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా… రెండవ టి20 లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.