BigTV English

JC Prabhakar Reddy : కంటతడి పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత.. ఇటీవల పరిణామాల విషయంలో తీవ్ర ఆవేదన..

JC Prabhakar Reddy : కంటతడి పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత.. ఇటీవల పరిణామాల విషయంలో తీవ్ర ఆవేదన..

JC Prabhakar Reddy : అనంత పురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ప్రత్యేక గుర్తింపు.. తన మాటతీరు, నడవడికతో రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మున్సిపల్ సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. ఇటీవల పరిణామాల్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన ఈయన.. ఇన్నాళ్లు గంభీరంగా ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా కంటతడి పెట్టుకోవడంతో.. అంతా ఆశ్చర్యపోయారు. పెద్దాయన ఎందుకు ఆవేదన చెందుతున్నారోనని ఆలోచిస్తున్నారు.


తెలుగుదేశం పార్టీని అనంతపురంతో సహా రాయలసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పటిష్టం చేసిన నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైఎస్ జగన్ హయంలో వైసీపీ నాయకుల దూకుడును తట్టుకుంటూ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ కేడర్ ని కాపాడుకుంటూ వచ్చిన ఈయన.. ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాడిపత్రిలోని ప్లైయాష్ తరలింపు విషయంలో సిమెంట్ పరిశ్రమలతో వివాదం దగ్గర నుంచి ఇటీవల బీజేపీ నాయకులతో తీవ్ర స్థాయి ఆరోపణల వరకు అన్నింటిలో జేసీ తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీ నిరంతరం మంచి పదవులతో సంతృప్తి పరుస్తూనే వచ్చింది. కాగా.. ఇటీవల జేసీ గురించి ఏపీలో తీవ్రంగా చర్చనడుస్తోంది. ఈ తరుణంలో.. పార్టీ సీనిరయ్ నేత కన్నీళ్లు పెట్టుకోవడంతో అంతా చర్చనీయాంశమవుతోంది.

ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీకి చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ మున్సిపాలిటీలోని అనేక అభివృద్ధి పనుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉంటే వెంటనే అధికారుల్ని పిలిపించి అక్కడికక్కడే దులిపేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి నేత.. తన సహచర మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ లు సరస్వతి, రఫీ, ఇద్దరు రాజీనామా చేశారు…


రాజీనామా చేసిన ఇద్దరు వైస్ చైర్మన్ లను ఘనంగా సన్మానించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రిలో మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో వారిని సత్కరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి సేవల గురించి ప్రశంసించారు. ఈ సమావేశంలోనే ఇటీవల పరిణామాల్ని గుర్తు చేసుకున్న జేసీ.. తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. తాను ఏం చేసినా, ఎంత కటువుగా మాట్లాడినా అంతా తాడిపత్రి అభివృద్ధి కోసమే అన్నారు. తనకు ప్రత్యేకంగా ఏ అధికారులు, సహచర నేతలపై కోపం లేదన్నారు. కౌన్సిలర్లు అంతా మంచివారంటూ కితాబిచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వారి వల్లనే తనకు అంత మంచి పేరు వచ్చిందంటు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే కారణం.. వారి సహకారమే అని తెలిపారు. ఈ సందర్భంగానే.. కంట తడి పెట్టున్నారు.. ఈ సీనియర్ నేత. దాంతో.. సభలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.

రానున్న రోజుల్లో తాడిపత్రి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తానని మాట ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. మూడు నెలల్లోనే సోలార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని రంగాల్లో తాడిపత్రిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, ఇండియాలోనే తాడిపత్రిని నెంబర్ వన్ మున్సిపాలిటీగా తయారు చేస్తానన్నారు. తాడిపత్రి పట్టణ ప్రజలకు, కౌన్సిలర్లకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఏ సమస్య వచ్చినా.. తాను ముందుంటి కాపాడుతానంటూ వ్యాఖ్యానించారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×