Big Stories

Pawan Kalyan : వేమన మాయం.. వైఎస్ఆర్ ప్రత్యక్షం ..పద్యంతో పవన్ పంచ్

- Advertisement -

Pawan Kalyan : ఏపీలో మహనీయుల విగ్రహాల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై వివాదం కొనసాగింది. తాజాగా కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్నే తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేమన విగ్రహం స్థానంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టడం కలకలం రేపుతోంది. ఈ వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. వేమన పద్యంతో ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు.

- Advertisement -

పవన్ ట్వీట్ చేసిన పద్యం
విద్యలేనివాడు విద్యాంసు చేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్యాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం

యూనివర్శిటీ యోగి వేమన పేరుతో ఉంటే ఆయన విగ్రహాన్ని తొలగించి వర్శిటీ అధికారులు వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిపై విద్యార్ధులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్ధి సంఘాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నాయి.

2006లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపలో యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయంతో రాయలసీమ విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. ప్రజా కవి యోగి వేమన పేరుతో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. వర్శిటీ ప్రాంగణంలో వేమన విగ్రహం పెట్టించారు. కానీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం యోగి వేమన విగ్రహాన్ని తొలగించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేమన విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో ఏ విగ్రహాలు ఉండకూడదా? అని ప్రశ్నించారు. యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News